
సాక్షి, అమరావతి : ఈఎస్‌ఐ స్కామ్‌లో టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు అరెస్ట్.. అవినీతిపై ప్రభుత్వం వేసిన తొలి అడుగు మాత్రమే అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ‘గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రస్తావిస్తున్నప్పుడు దమ్ముంటే విచారణ చేయమని, చేతనైతే కేసులుపెట్టాలని చంద్రబాబు మాట్లాడతారు. ఈఎస్‌ఐ కుంభకోణంలో పక్కా ఆధారాలతో అచ్చెన్నాయుడిపై ఏసీబీ దర్యాప్తు చేస్తుంటే మాత్రం రాజకీయ కక్ష అంటున్నారు, బీసీ రంగులు అద్దుతున్నారు. రివర్స్ టెండరింగ్‌తో రూ.2200 కోట్లు ఆదా ద్వారా అప్పట్లో ఎంతటి అవినీతికి పాల్పడ్డారో బయటపెట్టాక చర్యలు తీసుకోవడంలో తప్పేముంది! అచ్చెన్నాయుడు అరెస్ట్, అవినీతి చర్యలపై ప్రభుత్వం తొలి అడుగు మాత్రమే’అని ట్వీట్ చేశారు. (ఈఎస్‌ఐ కుంభకోణానికి ఆయనే ‘డైరెక్టర్’?)
Comments
Please login to add a commentAdd a comment