చేలంటే చిరాకు..సమైక్యాంధ్రపై పరాకు
Published Thu, Oct 31 2013 3:28 AM | Last Updated on Fri, Aug 10 2018 7:58 PM
తణుకు/తణుకు , న్యూస్‌లైన్ :‘వరి దుబ్బుల్ని తెచ్చుకోండి చూసిపెడతా’ అన్నట్టుగా సాగింది టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు పర్యటన. రైతు పరామర్శ యాత్ర పేరిట బుధవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు చేల వద్దకు వెళ్లకుండా.. రైతుల్ని తన వద్దకు రప్పించుకున్నారు. వారు తెచ్చిన వరి దుబ్బుల్ని చూశారు. కనీసం చేలగట్ల వరకైనా వచ్చి చంద్రబాబు తమను పరామర్శిస్తారని భావించిన రైతులకు నిరాశే ఎదురైంది. బాబు కాన్వాయ్ ప్రయూణించే ప్రాంతాలకు టీడీపీ నాయకులు ముందుగానే వెళ్లి ‘చంద్రబాబు వచ్చేస్తున్నారు. సెంటర్‌లోకిరండంటూ మైకులోంచి రైతులను పిలి చారు.
చంద్రబాబు తీరును చూసి విస్తుబోయిన రైతులు ‘చేలల్లోకి వస్తే ఆయ న దుస్తులు పాడైపోతాయనుకుంట. వరి దుబ్బుల్ని ఆయన దగ్గరకు తీసుకెళితేనే చూశారు’ అంటూ దెప్పిపొడిచారు. ఇదిలావుండగా, చంద్రబాబు పర్యటన ఆసాంతం ఎన్నికల ప్రచారం తరహాలోనే సాగింది. ఎక్కడైనా పది మంది కనిపిస్తే.. కాన్వాయ్‌ని ఆపించి మరీ రాష్ట్రానికి తానెంతో చేశానంటూ గొప్పలు చెప్పుకోవడం విమర్శల పాలైంది. తణుకు ప్రాంతంలో పదిహేను కిలోమీటర్ల మేర సాగిన చంద్రబాబు ఎక్కడా చేల గట్లకు వెళ్లలేదు. తిరుపతిపురం వద్ద ఆరుదల కోడు వంతెనపైకి వెళ్లి కోడును పరిశీ లించి వచ్చారు. ప్రభుత్వ విధానాల వలనే రైతులు నాశనం అవుతున్నారం టూ వ్యాఖ్యానించారు. కొద్దిదూరంలో ఉన్న ఆరుదలకోడు స్లూయిజ్‌ను చంద్రబాబు చూస్తారని భావించిన రైతులకు నిరాశే ఎదురైంది.
అడుగడుగునా చంద్రబాబుకు సమైక్య సెగ
జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు అడుగడుగునా సమైక్య సెగ తగి లింది. ఆంధ్రా షుగర్స్‌లో టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన అనంతరం కాన్వాయ్‌లో బయలుదేరిన చంద్రబాబును నరేంద్ర సెంటర్‌లో ఎన్జీవో జేఏసీ నాయకులు పీవీ రమణ, వైవీ సత్యనారాయణమూర్తి తదితరులు అడ్డుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. వారిని పట్టించుకోకుండా బాబు ముందుకు వెళ్లిపోగా, పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థి జేఏసీ జిల్లా కో-కన్వీనర్ అనుకుల రమేష్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున చేరుకున్న విద్యార్థులు ఆయన ప్రయూణిస్తున్న కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.
‘విభజన వద్దు.. సమైక్యాంధ్ర ముద్దు’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ‘జై సమైక్యాంధ్ర’ అనాలని చంద్రబాబును పట్టుబట్టారు. అందుకు ససేమిరా అన్న బాబు వాస్తవాలను తెలుసుకోవాలంటూ విద్యార్థులను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. సమైక్యాంధ్ర విషయంలో తన విధానం ఏమిటో చెప్పని బాబు సోనియా గాంధీ ద్వంద్వ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ను తానే అభివృద్ది చేశానని, సైబరాబాద్‌ను సింగపూర్‌కు దీటుగా మార్చానని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశా రు. దీంతో విద్యార్థుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. ఒక దశలో ‘నేను చె ప్పింది మీరు వినాల్సిందే’ అంటూ విద్యార్థులపై ఆయన విరుచుకుపడ్డారు.
కంగుతిన్న విద్యార్థులు కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో పోలీసుల సాయంతో ముందుకు వెళ్లిపోయారు. అనంతరం దువ్వ-వరిఘేడు ప్రాం తంలోని దానమ్మగుడి ప్రాంతంలో సమైక్యవాదుల నుంచి మరోసారి నిరసన ఎదురైంది. సమైక్యవాదులతో జత కలిసిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు సైతం ‘సమన్యాయం కాదు సమైక్యాం ధ్ర కావాలని చెప్పండి. జై సమైక్యాంధ్ర అనండి’ అంటూ పట్టుబట్టారు. అక్కడి వారిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ‘చంద్రబాబు గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు.
వ్యాపారాల్ని వదిలేయండి.. పార్టీ కోసమే బతకండి
ఆంధ్రా షుగర్స్ ప్రాంగణంలో నిర్వహించిన సభలో పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. సభలో ఆయన మాట్లాడుతూ ‘నా ఆశ.. నమ్మకం కార్యకర్తలపైనే. వాళ్లనే నమ్ముకున్నాను. తమ్ముళ్లూ.. ఆరు నెలల పాటు అన్ని పనులూ బంద్ చేయండి. వ్యాపారాలు మానేయండి. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనండ’ని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆ తరువాత రైతు యూత్రకు బయలుదేరిన చంద్రబాబు మార్గమధ్యంలో కనిపిం చిన జనాలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘సోనియూగాంధీ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆదాయం పెరిగింది. మన కార్యకర్తలకు మాత్రం ఆదాయం లేకుండా పోయింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బంటే తనకు ప్రేమ లేదంటూనే డబ్బుకోసం మాట్లాడటం ఆయనను చూసేందుకు వచ్చిన వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.
కాంగ్రెస్‌పై విమర్శలు
‘ముప్పై ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇంది రాగాంధీ, రాజీవ్ గాంధీలను చూశా ను. ఈవిడ (సోనియా) నాకో లెక్కా’ అంటూ రైతులను ఉద్దేశించి వ్యాఖ్యానాలు చేశారు. రైతుల్ని పరామర్శిం చడం మానేసి ప్రతి సందర్భంలోనూ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడటం చర్చనీయూంశమైంది. ఒకే తల్లికి పుట్టిన ఇద్దరి బిడ్డల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఇరుపక్షాలను కూర్చోబెట్టి మాట్లాడటం మానేసి ఏకపక్షంగా విడదీసినట్టుగా రాష్ట్ర విభజన నిర్ణయం ఉందని చంద్రబాబు అన్నారు.
వైఎస్ జగన్‌పై అక్కసు
జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణను చూసి భయపడుతున్న చంద్రబాబు ఆయనపై మరోసారి విరుచుకుపడ్డారు. రైతు పరామర్శ యూత్ర పేరిట చేసిన పర్యటన పొడవునా వైఎస్ బురద చల్లేందుకుకే చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన సమైక్య శంఖారావం సభకు జనం రైళ్లలో వెళ్లడాన్ని ఎగతాళి చేస్తూ.. సమైక్యవాదానికి తూట్లు పొడిచేలా మాట్లాడారు. ‘పాసింజర్ రైళ్లను పక్కనబెట్టి వాటి మధ్యలోంచి సమైక్య సభకు వెళ్లే ైరె ళ్లను ఎలాంటి ఆటంకాలు లేకుండా పంపించారం’టూ బాబు విరుచుకుపడ్డారు. సమైక్య నినాదాలు చేసిన ప్రజలను ‘ఎవరో మందుపోస్తే.. తాగొచ్చి గొడవ చేస్తున్నారం’టూ చిన్న కాపులకు వలవేసే యత్నం
ఉభయ గోదావరి జిల్లాల్లో అధిక సంఖ్యలో ఉన్న కాపు కులస్తులను ఆకట్టుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారు.
కాపుల్లో పేదవారికి న్యాయం చేస్తానని పలుచోట్ల ఆయన చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక కమిషన్ వేసి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల చొప్పున ఐదేళ్లపాటు వారి అభ్యున్నతి కోసం ఖర్చు చేస్తానని హామీలు గుప్పించారు. చంద్రబాబు వెంట టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, పార్టీ ముఖ్య నాయకులు వైటీ రాజా, యర్రా నారాయణస్వామి, మాగంటి బాబు, ముళ్లపూడి వెంకట కృష్ణారావు, ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, టీవీ రామారావు, వేటుకూరి శివరామరాజు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ త్సవటపల్లి బాబ్జి, పీతల సుజాత, నాయకులు పాలి ప్రసాద్, కొక్కిరగడ్డ జయరాజు, ఆరిమిల్లి రాధాకృష్ణ, దొమ్మేటి సుధాకర్, బసవ రామకృష్ణ, తాతపూడి మారుతీరావు, వి.గోవిందు ఉన్నారు.
Advertisement
Advertisement