జగన్‌తోనే సమైక్యం సాధ్యం | samaikyandhra possible with only jagana moha reddy | Sakshi
Sakshi News home page

జగన్‌తోనే సమైక్యం సాధ్యం

Published Sun, Dec 22 2013 4:07 AM | Last Updated on Wed, Aug 8 2018 5:41 PM

జగన్‌తోనే సమైక్యం సాధ్యం - Sakshi

జగన్‌తోనే సమైక్యం సాధ్యం

మైలవరం, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలిగే ఏకైక నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కడేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. మైలవరం బోసుబొమ్మ సెంటర్‌లో శనివారం జరిగిన సమైక్య శంఖారావం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. చంద్రబాబు, లగడపాటి, సీఎం కిరణ్‌లు సమైక్యాంధ్ర  ద్రోహులని విమర్శించారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటిస్తూ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం హాస్యాస్పదంౄ ఉందన్నారు. కోడెల శివప్రసాద్, దేవినేని ఉమా ఇక్కడ సమైక్యాంధ్ర గురించి మాట్లాడుతుంటే.. తెలంగాణలో రేవంత్ తదితరులు రాష్ట్రం విడిపోవాలని కోరుతూ విభజనకు అంగీకార లేఖ ఇచ్చింది చంద్రబాబేనని చెబుతున్నారన్నారు. దానికి సమాధానం చెప్పలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు.  

రాష్ట్రాన్ని రెండుగా చీల్చమన్న వ్యక్తికి సమైక్యం కోసం నోరెత్తే సత్తా ఉందా అని ప్రశ్నించారు. సమైక్య సింహంగా పొగిడించుకున్న ముఖ్యమంత్రి కిరణ్ ప్రస్తుతం సమైక్యం కోసం ఏం చేస్తున్నారో చెప్పాలన్నారు. తన ఆస్తులను కాపాడుకోవటానికే లగడపాటి ఢిల్లీలో సోనియా చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రాష్ట్రంలో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, టీడీపీలను మట్టికరిపించి అధికారం చేపట్టగలిగిన సత్తా జగన్‌మోహన్‌రెడ్డికే ఉందన్నారు. పెడన నియోజకవర్గం జోగి రమేష్‌ని అభిమానించిందని, ప్రస్తుతం ఆయన్ని మైలవరం నియోజకవర్గం ఆహ్వానిస్తోందని రాంబాబు చెప్పారు. మైలవరం ఎమ్మెల్యేగా అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి జోగి రమేష్ అని తెలిపారు.
 దేశంలోనే ఒక శక్తిగా ఎదుగుతున్న వ్యక్తి జగన్...
 దేశంలోనే ఒక శక్తిగా ఎదుగుతున్న వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అని పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు విజయచందర్ అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీ గడ్డపై కాలు పెట్టిన ప్రతి కాంగ్రెస్, టీడీపీ నాయకులు నాలుగు కాళ్ల జంతువుగా మారిపోతున్నారని ఎద్దేవా చేశారు. జాతి గౌరవాన్ని కాపాడగలిగిన ఒకే ఒక్కడు వైఎస్ జగన్ జగన్‌తోనే సమైక్యం సాధ్యం
  అని చెప్పారు. అదరక బెదరక సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న మొనగాడు, సోనియా నుంచి అందరి నాయకులకు నిద్ర పట్టకుండా చేస్తున్న వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అని తెలిపారు. రాష్ట్ర ప్రజల భవితను కాపాడగలిగేది జననేత జగనేనని చెప్పారు. ఈ సందర్భంగా నేతలు వైఎస్సార్‌సీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్‌ను ప్రజల హర్షధ్వానాల మధ్య ఆవిష్కరించారు. పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, విజయవాడ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్, ఎల్‌బీఆర్‌సీఈ ఆధ్యక్షుడు లకిరెడ్డి బాలిరెడ్డి తదితరులు ప్రసంగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement