కార్పొరేషన్ వద్ద పారిశుధ్య కార్మికుల ఆందోళన
విజయవాడ సెంట్రల్ : ‘జీతాలొచ్చి మూడు నెలలైంది... ఇల్లు అద్దెకు ఇచ్చివారు ఖాళీచేసి పొమ్మంటున్నారు.. ఆటో చార్జీలకూ అప్పు చేయాల్సి వస్తోంది.. ఇలా అయితే ఏం తినాలి? ఎలా బతకాలి?’ అంటూ పారిశుధ్య కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. నగరపాలక సంస్థ ప్రధానకార్యాలయం ఎదుట ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం వేర్వేరుగా ధర్నా చేశారు. డిసెంబర్ నుంచి పెండిం గ్‌లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మెరుపుసమ్మెకు దిగుతామని అల్టిమేటం ఇచ్చారు. ఈ సందర్భంగా మునిసిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏఐటీయూసీ నాయకుడు ఆసుల రంగనాయకులు మాట్లాడుతూ అధికారులు చేసిన తప్పులకు కార్మికుల జీతాలను పెండింగ్ పెట్టడం సరికాదన్నారు. ఈఎస్‌ఐ, పీఎఫ్ కింద కార్మికులు జీతాల నుంచి నగదు మినహాయిస్తున్న అధికారులు ఆయా సంస్థలకు ఎందుకు జమ చేయడంలేదో వెల్లడించాలని డిమాండ్‌చేశారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న నగరపాలక సంస్థ అధికారు లపై త్వరలో లోకాయుక్తాను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఏడు రోజులు విధులకు హాజ రుకాకుంటే కార్మికులను విధుల నుంచి తొల గించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవో వచ్చిందని అధికారులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
సంక్షేమాన్ని విస్మరిస్తున్నారు
సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాను ఉద్దేశించి సీపీఎం నగర కార్యదర్శి సీహెచ్.బాబూరావు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమాన్ని అధికారులు, పాలకులు విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తున్న పాలకులకు సకాలంలో జీతాలు చెల్లించాలనే విషయం తెలవకపోవడం దురదృష్టకరమన్నారు. కమిషనర్ స్పందించి సమస్యను పరి ష్కరించాలని కోరారు. ఏఐటీయూసీ, సీఐ టీయూ నాయకులు జె.జేమ్స్, సాంబశివరావు, పద్మ, ఎం.డేవిడ్, ఎ.లక్ష్మి పాల్గొన్నారు.
ఏం తినాలి.. ఎలా బతకాలి..!
Published Fri, Feb 20 2015 1:36 AM | Last Updated on Thu, Mar 28 2019 4:53 PM
Advertisement