డ్రైవర్లు లేక ఒకచోట.. ఖాళీగా మరోచోట! | Empty conscious drivers or elsewhere | Sakshi
Sakshi News home page

డ్రైవర్లు లేక ఒకచోట.. ఖాళీగా మరోచోట!

Published Wed, Jun 29 2016 12:22 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM

Empty conscious drivers or elsewhere

వైద్య ఆరోగ్య శాఖలో వింతపోకడ
ముగ్గురు డ్రైవర్లు  డీఎంఅండ్‌హెచ్‌వో సేవలోనే..
నిబంధనలకు విరుద్ధంగా గుంటూరుకు వాహనం తీసుకెళుతున్న వైనం

 

ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు  వ్యక్తమవుతున్నాయి. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో డ్రైవర్లు లేక అంబులెన్స్‌లు కదలని పరిస్థితి ఉంటే.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో మాత్రం వాహనాలు లేక డ్రైవ ర్లు ఖాళీగా ఉంటూ జీతాలు తీసుకుంటున్నారు. చక్కదిద్దాల్సిన అధికారులు తప్పించుకునేలా వ్యవహరిస్తున్నారు. దీంతో వ్యవస్థ గాడితప్పుతోంది.    

 

లబ్బీపేట :  వైద్య ఆరోగ్య శాఖలో వింత ధోరణి నెలకొంది. డ్రైవర్లు లేక వాహనాలు కదలని పరిస్థితి ఒకచోట ఉంటే.. డ్రైవర్లు ఉన్నా వాహనాలు లేక మరికొన్ని ప్రాంతాల్లో జీతాలు అందుకుంటున్నారు. నిత్యం గుంటూరు నుంచి రాకపోకలు సాగించే జిల్లా వైద్యాధికారిణి ముగ్గురు డ్రైవర్లను తన వాహనానికి వినియోగించడం విశేషం. అంబులెన్స్‌లకు డ్రైవర్లు లేక అదే శాఖలోని పలు ప్రాంతాల్లో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అధికారులు తమ స్వార్థం కోసం కండీషన్‌లో ఉన్న వాహనాలను సైతం నిర్వీర్యం చేస్తూ, సొంత వాహనాల్లో తిరుగుతూ అద్దెలు పొందుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 
తొమ్మిది వాహనాలు.. 15 మంది డైవర్లు

ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి తొమ్మిది వాహనాలు ఉండగా పదిహేను మంది డ్రైవర్లు ఉన్నారు. తిరువూరు, గంపలగూడెం పీహెచ్‌సీల్లో కండీషన్‌లో ఉన్న వాహనాలు ఉన్నా డ్రైవర్లు లేక మూలనపెట్టారు. మరో వైపు వెంట్రప్రగడ, తోట్లవల్లూరు పీహెచ్‌సీల్లో డ్రైవర్లు ఉన్నా.. వాహనాలు లేక ఖాళీగా ఉంటున్నారు. వారికి వాహనా లు అప్పగించే అవకాశం ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు డ బ్బులు వచ్చే పనులు మినహా ప్రజలు, రోగులకు అవసరమైన పనులపై అధికారులు దృష్టి పెట్టడం లేదని ఆ శాఖ ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. రెండు, మూడేళ్లుగా  ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు స్పందించక పోవడంపై వారి నిర్లక్ష్యానికి తార్కాణంగా నిలుస్తోంది. 

 
ప్రభుత్వాస్పత్రిలో డ్రైవర్లు లేక..

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మూడు అంబులెన్స్‌లు ఉండగా, ముగ్గురు డ్రైవ ర్లు మాత్రమే ఉన్నారు. వారిలో ముఖ్యమంత్రి నగరంలో ఉన్నప్పుడు ఇద్దరు డ్రైవర్లు కాన్వాయ్‌కు వెళ్లిపోవడంతో ఇం కా ఒక్కరు మిగులుతున్నారు. దీంతో కొత్త ఆస్పత్రి నుంచి పాత ఆస్పత్రికి, పాత ఆస్పత్రి నుంచి కొత్త ఆస్పత్రికి రో గులను షిప్ట్ చేయడం ఇబ్బందికరంగా మారుతోంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో వాహనాలు లేక డ్రైవర్లు ఖాళీగా ఉంటుండగా, ఇక్కడేమే డ్రైవర్లు లేక వాహనాలు కదలనిదుస్థితి నెలకొంది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. 

 

నిబంధనలకు విరుద్ధంగా గుంటూరుకు వాహనం
ఏ జిల్లా అధికారి అయినా తమ వాహనాన్ని నిబంధనల ప్రకారం జిల్లా పరిధిలో తిరిగేందుకు మాత్రమే వినియోగించాల్సి ఉంది. కానీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి  రెండేళ్లుగా గుంటూరు నుంచి తన అధికారిక వాహనంలోనే రాకపోకలు సాగిస్తున్నారు. అందుకు గాను ఆమె ముగ్గురు డ్రైవర్లను నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కో డ్రైవర్ వారం రోజుల చొప్పున ఇద్దరు డ్రైవర్లు రెగ్యులర్‌గా పనిచేస్తుండగా, వారు సెలవు పెట్టిన సమయంలో ఉండేందుకు మరొకరిని తమ క్యాంపు ఆఫీసులో రిజర్వ్‌లో ఉంచడం కొసమెరుపు.

 

వాహనాలకు మరమ్మతులు చేయిస్తున్నాం
జిల్లాలో పుష్కరాల డ్యూటీల కు వాహనాలు కావాల్సిఉన్నం దున  మరమ్మతులు చేయిస్తున్నాం. కొన్ని చోట్ల డ్రైవర్లు ఖాళీగా ఉన్నారు. మరమ్మతులు పూర్తయిన వెంటనే సర్దుబాటు చేస్తాం. డీఎంహెచ్‌వోకు ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. అందులో తప్పేమిలేదు. - డాక్టర్ ఆర్.నాగమల్లేశ్వరి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement