గొల్లప్రోలు: తూర్పు గోదావరి జిల్లాలో శనివారం ఉదయం ఓ స్కూల్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. గొల్లప్రోలు మండలం మల్లవరం వంతెన సమీపంలో ఓ ప్రయివేటు పాఠశాల బస్సు అదుపు తప్పి వంతెన గోడను ఢీకొంది. వివరాలు.. జిల్లాలోని గొల్లప్రోలు మండలం మల్లాపురం వంతెన వద్ద మల్లాపురం నుంచి పిఠాపురం వెళ్తున్న భాష్యం స్కూల్ బస్ మల్లాపురం వంతెన వద్ద ప్రమాదానికి గురైంది. బస్సు వంతెనపై శిథిలావస్థలో ఉన్న రేలింగ్‌ను ఢీకొని కాలువలోకి ఒరిగింది. బస్సు వెనుక భాగం బ్రిడ్జిపై ఇరుక్కుపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల సాయంతో పిల్లలను సురక్షితంగా బయటపడేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాద సమయంలో మల్లాపురం సమీప గ్రామాలకు చెందిన 38 విద్యార్థులు బస్సులో ఉన్నారు.
కాగా విశాఖ జిల్లాలోనూ ఓ స్కూలు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని లంకెలపాలెం జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు స్కూల్ బస్సును లారీ డీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు విద్యార్థులను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు.
స్కూలు బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం
Published Sat, Aug 8 2015 10:06 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement