కలెక్టరేట్, న్యూస్‌లైన్:
డీఈఓ రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ బోధనపరంగానే గాకుండా విద్యార్థులను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలక భూమికన్నారు. పవిత్రమైన, ఆదర్శవంతమైన వృత్తికి న్యాయం చేయాలని ఆమె సూచించారు. ప్రతి గ్రామంలో గుడి బడి రెండూ ఉంటాయని, బడులను గుడులుగా మార్చాల్సిన బాధ్యత గురువులదేనన్నారు. కనిపించని దైవం గుడిలో ఉంటే.. కనిపించే దైవం బడిలో ఉంటారని తెలిపారు. ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, సంస్కృతిని నేర్పేందుకు కృషి చేయాలని సూచించారు. నేటి యువత పాశ్చాత్య సంస్కృతికి గురవుతూ గ్రామీణ వాతావరణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై అత్యాచారాలు, నేరాలు పెరుగుతున్నాయని, విద్యార్థులకు నీతి నిజాయితీతో కూడిన విలువలను బోధించాలన్నారు.
రూ.6 వేల కోట్లతో మౌలిక వసతులు..
రాష్ట్ర ప్రభుత్వం విద్యాప్రమాణాలు పెంపొం దించేందుకు కృషి చేస్తోందని, పాఠశాలల్లో మౌ లిక వసతులు కల్పించేందుకు 2012-13 విద్యా సంవత్సరంలో రూ.6వేల కోట్లు ఖర్చు చేసింద ని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల మనుగడను కాపాడుకునేలా సమష్టి కృషితో పనిచేయాలని సూచించారు. సన్మానం పొంది న ఉపాధ్యాయులు మరింత బాధ్యతతో పని చేసి పలువురికి ఆదర్శంగా నిలవాలన్నారు.
ఉపాధ్యాయుల కృషి భేష్..
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు చేయూతనందించేందుకు జిల్లాలోని ఉపాధ్యాయులు ‘స్టూడెంట్ వెల్ఫేర్ ఫండ్’ పేరిట ముందుకు రావడం అభినందనీయమని మంత్రి అన్నారు. ఈ ఏడాది పదోతరగతి ఫలితాల్లో మెరుగైన స్థానం పొందేందుకు కృషి చేయాలన్నారు.
మనుగడ కోసం సమష్టిగా కదలాలి: కలెక్టర్
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాలలు మనుగడ సాధించాలంటే ఉపాధ్యాయుల సమష్టి కృషితోనే సాధ్యమని కలెక్టర్ దినకర్‌బాబు సూచించారు. సమాజంలో గురువులకు సముచిత స్థానం ఉన్నా కాలానుగుణంగా తగ్గిందని, దాన్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ప్రణాళికతో ముందుకు వెళ్తే మెరుగైన ఫలితాలు సాధ్యమన్నారు. ప్రభుత్వం 2012-13లో వె య్యికి పైగా అదనపు గదుల నిర్మాణం చేపట్టిందన్నారు. అదనపు జేసీ మూర్తి మాట్లాడుతూ విద్యార్థుల ను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సాం స్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.
అనంతరం జిల్లా స్థాయిలో ఉత్తమ ఉ పాధ్యాయులుగా ఎంపికైన 55 మందికి మంత్రి సునీతారెడ్డి మొక్కలు, జ్ఞాపికలు అందజేసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఆశీర్వాదం, ఇన్‌చార్జి ఆర్డీఓ ప్రసా ద్, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ పీసీపీ రాజు, ఐసీడీఎస్ పీడీ శైలజ, డిప్యూటీ ఈఓలు, ఎంఈ ఓలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బడులను గుడులుగా మార్చాలి
Published Fri, Sep 6 2013 1:35 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM
Advertisement
Advertisement