చిత్తూరు(టౌన్), న్యూస్‌లైన్: రెండున్నర నెలల తర్వాత పూర్తి స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు గురువారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. జూలై 30న రాష్ట్ర విభజనపై ప్రకటన రావడంతో మరుసటి రోజు నుంచే జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. ఆగస్టు 22వ తేదీ నుంచి ఉపాధ్యాయులు సమ్మెలోకి వెళ్లడంతో పాఠశాలలు పూర్తిగా మూతపడ్డాయి.
ఈ నెల 11వ తేదీన ఉపాధ్యాయులు సమ్మె విరమించినా, దసరా సెలవుల కారణంగా పాఠశాలలు ప్రారంభంకాలేదు. 16వ తేదీకి సెలవులు ముగియడంతో గురువారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఇకపై రెండో శనివారం, ఆదివారం కూడా పాఠశాలలు పనిచేయ నున్నాయి. దాదాపు రెండు నెలలు పాఠశాలలు మూతపడడంతో సిలబస్ పూర్తి కాలేదు. సిలబస్ పూర్తి చేసి నవంబర్ మొదటివారంలో త్రైమాసిక పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు సమాచారం. చాలా రోజుల తర్వాత పాఠశాలలు తెరుస్తున్నందున విద్యార్థులు మొదట్లో పెద్దగా రాకపోయే అవకాశం ఉంటుందని, దీనిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డీఈవో బి.ప్రతాప్‌రెడ్డి ఆదేశించారు.
ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తాం
ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అ మలు చేస్తాం. సమ్మె వల్ల పనిదినాలను కోల్పోయినా రాబోయే నెలల్లో సెలవుల్లో పనిచేయడానికి ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారు. విద్యార్థు లు నష్టపోకుండా సకాలంలో సిల బస్ పూర్తి చేస్తాం. పదోతరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం.
-బి.ప్రతాప్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
Published Thu, Oct 17 2013 2:20 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM
Advertisement