ఇదేందయ్యా ‘చంద్రం! | security for chandragiri mla | Sakshi
Sakshi News home page

ఇదేందయ్యా ‘చంద్రం!

Published Fri, Jul 4 2014 3:33 AM | Last Updated on Sat, Jul 28 2018 5:57 PM

ఇదేందయ్యా ‘చంద్రం! - Sakshi

ఇదేందయ్యా ‘చంద్రం!

- చంద్రగిరి ఎమ్మెల్యేకు భద్రత కుదించిన సర్కార్!
- అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంలో ప్రజాప్రతినిధికి భద్రత కుదించడంపై విమర్శలు

 సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఆ నియోజకవర్గం ఒకప్పుడు నక్సల్స్‌కు అడ్డా.. ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు.. ఇప్పుడు ఆ నియోజకవర్గం తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ల కు చిరునామా.. ఎర్రచందనం స్మగ్లర్లను ఏరివేయడానికి పోలీసులు రంగంలోకి దిగడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. అత్యం త సమస్యాత్మక నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు భద్రత పెంచాల్సింది పోయి ప్రభుత్వం తగ్గించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహంలో భాగంగానే ఈ ఎత్తు వేశారని పోలీసు వర్గాలే విమర్శిస్తున్నాయి..
 
చంద్రగిరి నియోజకవర్గం సీఎం చంద్రబాబునాయుడు జన్మించిన ప్రాంతం. మాజీ మంత్రులు గల్లా అరుణకుమారి, గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఎంపీ శివప్రసాద్ ఆ నియోజకవర్గానికి చెందిన వారే. ఆ నియోకజకవర్గంలో వైఎస్సార్‌సీపీ తరఫున చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి గల్లా అరుణకుమారిపై ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు. ఇది టీడీపీ అధినేత చంద్రబాబుకు కంటగింపుగా మారింది.

ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటి నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రజలతో మేమకవుతుండటం టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి భద్రతను కుదించడం ద్వారా ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలని టీడీపీ నేతలు ఎత్తు వేశారు. ఇదే అంశంపై సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన చంద్రబాబు ప్రభుత్వం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి భద్రతను 2+2 నుంచి 1+1కు కుదించింది. అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంలో ప్రజాప్రతినిధికి భద్రత కల్పించడంలో ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై పోలీసువర్గాలే నివ్వెరపోతున్నాయి.
 
ఎన్నికలకు ముందూ.. తర్వాతా..
సార్వత్రిక ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాదయాత్ర చేస్తోన్న సమయంలో పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ శ్రేణులు లక్ష్యంగా టీడీపీ నేతలు దాడులు చేశారు. ఈ దాడుల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఒకరు మృతిచెందారు. ఫలితాలు వెలువడ్డాక ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు పలు గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడ్డారు.
 
‘ఎర్ర కూలీలకు అడ్డా..
తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు ఇదే నియోజకవర్గం కేంద్రంగా అరాచకాలు సాగిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టించేందుకు పోలీసులు భా రీ ఎత్తున గాలింపు చేపట్టారు. పోలీసులు, ఎర్రచంద నం స్మగ్లర్ల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం సాగుతోంది. ఎదురుకాల్పుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు, పోలీసులు కన్నుమూశారు. నియోజకవర్గ గత చరిత్రను ఒక్కసారి పరిశీ లిస్తే ఫ్యాక్షన్ రాజకీయాలు సాగినట్లు స్పష్టమవుతోంది. నక్సల్స్ కార్యకలాపాలకు ఈ నియోజకవర్గం కేంద్రం గా ఉండేది. పలు ప్రాంతాల్లో నక్సల్స్ చేసిన దాడుల్లో పలు ఇళ్లు, ఆస్తులు ధ్వంసమైన విషయం విదితమే.
 
భద్రత పెంచాల్సిన సమయంలో..
అత్యంత సమస్యాత్మకమైన ఈ నియోజకవర్గంలో ఎ మ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రజలకు సేవ చేసేందుకు విస్తృతంగా పర్యటిస్తున్నారు. భద్రత కుదించిన నేపథ్యంలో సంఘవిద్రోహక శక్తులు చెవిరెడ్డిపై దాడి చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎర్రచందనం స్మగ్లర్ల వంటి సంఘవిద్రోహక శక్తులు తమపై పోలీసులు చేస్తోన్న దాడికి నిరసనగా ఎమ్మెల్యే చెవిరెడ్డిని కిడ్నాప్ చేసే అవకాశం కూడా ఉందని నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు విశ్వసనీయం గా తెలిసింది. నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఎమ్మెల్యే చెవిరెడ్డికి భద్రత పెంచాల్సిన ప్రభుత్వం కుదించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే చెవిరెడ్డిని ప్రజలకు దూరం చేసేందుకే భద్రతను కుదించినట్లు పోలీసువర్గాలే అనుమానాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement