
నీలకంఠాపురంలో రఘువీరారెడ్డి ఇల్లు ముట్టడి
అనంతపురం: మంత్రి రఘువీరా రెడ్డికి సమైక్యాంధ్ర సెగ తగిలింది. నీలకంఠాపురంలోని ఆయన ఇంటిని సమైక్యవాదులు ముట్టడించారు. రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు.
సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎంపీల వైఖరికి నిరసనగా మడకశిరలో ఉపాధ్యాయులు చెవిలో పూలతో నిరసన తెలిపారు. మంత్రి రఘువీరా రెడ్డిని అడ్డుకునేందుకు మడకశిర నుంచి నీలకంఠాపురం వెళుతున్న ఉద‌్యోగులు, ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనగా సమైక్యవాదులు రోడ్డుపై బైఠాయించారు. దాంతో మడకశిరలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.