హైదరాబాద్: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారశైలిపై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. రాష్ట్ర విభజనపై సుదీర్ఘ ఉత్కంఠకు తెరదించుతూ.. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటి వరకూ రాజీనామాలపై వెనుకంజ వేయడానికి సీఎం వైఖరే కారణమని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు శుక్రవారం సాయంత్రం క్యాంప్ ఆఫీసులో సీఎంతో సమావేశమైయ్యారు.
ఇప్పటి వరకూ తెలంగాణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపుతుందా?లేదా అనే సందిగ్ధంలో ఉన్న నేతలు..బిల్లు అసెంబ్లీకి వస్తే ఏం చేయాలన్న అంశంపై కసరత్తు చేస్తున్నారు.