పదవుల కోసం, ప్యాకేజిల కోసం సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, కేంద్రమంత్రులు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని సీమాంధ్ర ఉద్యోగుల జేఏసీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.
పదవుల కోసం, ప్యాకేజిల కోసం సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, కేంద్రమంత్రులు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని సీమాంధ్ర ఉద్యోగుల జేఏసీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. విభజన దిశగా కాంగ్రెస్ పార్టీ వేగంగా అడుగులు వేస్తుండటం, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు కూడా అందుకు తందానా అంటుండటంతో తమ భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకోడానికి ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు సమావేశమయ్యారు.
కాంగ్రెస్ నాయకులను ఓడించడమే లక్ష్యంగా తమ ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని నాయకులు చెప్పారు. రాయల తెలంగాణ, హైదరాబాద్ యూటీ లాంటి అంశాలపై అంగీకరించడానికి సీమాంధ్ర కేంద్ర మంత్రులకు ఎవరు అధికారమిచ్చారని నిలదీశారు. తమ భవిష్యత్ కార్యచరణను సాయంత్రం ప్రకటిస్తామని అన్నారు.