సర్వం బంద్
బలవంతపు విభజనపై జిల్లా ప్రజలు భగ్గుమన్నారు. బంద్ పాటించి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా జరిగింది. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. విద్యాసంస్థలు మూతపడ్డాయి. సమైక్యవాదులు ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలు, మాన వహారాలతో కాంగ్రెస్ సర్కారుపై ఆగ్రహం వెళ్లగక్కారు. టెక్కలిలో కేంద్రమంత్రి కృపారాణి ఇంటిపై ఆందోళనకారులు చెప్పులు విసిరారు. ఈ సందర్భంగా పోలీసులు 16 మందిని అదుపులోకి తీసుకున్నారు.
శ్రీకాకుళం సిటీ/ శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్‌ను విభజనను నిరసిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం చేపట్టిన జిల్లా బంద్ ప్రశాంతంగా ముగిసిం ది. ప్రజలు, వ్యాపారులు, అన్ని వర్గాలు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడంతో బంద్ సంపూర్ణమైంది. వైఎస్‌ఆర్ సీపీ నాయకులు పలు ప్రాంతాల్లో సోనియా, చంద్రబాబు, యూపీఏ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేస్తూ..నిరసన తెలి పారు. పాతపట్నం, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో తప్ప..టీడీపీ ఎక్కడా బంద్ లో పాల్గొనలేదు.
శ్రీకాకుళంలో..
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు వేకువజామునే వైఎస్‌ఆర్ సీపీ శ్రేణులు చేరుకుని ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నాయి.
అనంతరం ప్రధాన రహదారి వద్ద రాస్తారోకో నిర్వహించి, యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి.
ఏడురోడ్ల కూడలి, సూర్యమహల్ వద్ద దిష్టిబొమ్మలను దహనం చేశాయి. ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యురాలు వరుదు కళ్యాణి, నియోజకవర్గ సమన్వయకర్తలు వైవీ సూర్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి దుప్పల రవీంద్ర, ఎం.వి.పద్మావతి తదితరులు పాల్గొన్నారు..
టెక్కలిలో: వైఎస్‌ఆర్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయ కర్త దువ్వాడ శ్రీనివాస్‌తో పాటు నాయకులంతా పట్టణంలో బైక్ ర్యాలీ చే స్తూ, కేంద్రమంత్రి కిల్లి కృపారాణి ఇంటికి ఎదురుగా బైఠాయించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులకు, పార్టీ శ్రేణల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
పలాసలో: పలాస-కాశీబుగ్గలో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు సోనియా దిష్టిబొమ్మ ను దహనం చేశాయి. మధ్యాహ్నం వర కు బస్సులను కదలనీయలేదు. స్వచ్ఛం దంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సం స్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, సినిమా థియేటర్లు బంద్ పాటించాయి. పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు, వైఎస్‌ఆర్ సీపీ పలాస నియోజకవర్గ సమన్వయకర్త వజ్జ బాబూరావు, టీడీపీ నాయకుడు లొడగల కామేశ్వరరావు, గాలి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
రాజాంలో: స్థానిక వైఎస్‌ఆర్ కూడలి వద్ద వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు మానవహారం నిర్వహించి ధర్నా చేశారు. పార్టీ సీఈసీ సభ్యుడు పీఎంజే బాబు, రాగోలు ఆనంద్, శాసపు జగన్, పిట్టా జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
పాలకొండలో: స్థానిక శ్రీకాకు ళం రోడ్డుపై వైఎస్‌ఆర్ సీపీ శ్రేణులు రా స్తారోకో నిర్వహించి, వాహనాలను అ డ్డుకున్నాయి. విద్యాసంస్థలు, దుకాణా లు మూతపడ్డాయి. పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు వెలమల మన్మథరావు తదితరులు పాల్గొన్నారు.
ఆమదాలవలసలో: స్థానిక పాలకొండ రోడ్డులో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించి, బస్సుల రాకపోకల ను అడ్డుకున్నాయి. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం, కూన మంగమ్మ, కిల్లి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
నరసన్నపేటలో: వైఎస్‌ఆర్ కూడలి వద్ద రాస్తారోకో, ర్యాలీ, ధర్నా నిర్వహిం చారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ధర్మాన రామలింగంనాయుడు, చింతు రామారావు, ఆరంగి మురళి పాల్గొన్నారు.
ఎచ్చెర్లలో: విద్యాసంస్థలన్నీ స్వచ్ఛంద బంద్ పాటించాయి. ఇంజనీరింగ్ కళాశాలలు, ఫార్మసీ కళాశాలల విద్యార్థులు ర్యాలీగా వెళ్లి.. విభజన తీరును ఎండగట్టారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
పాతపట్నంలో: విభజనను నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమా లు నిర్వహించారు. ఆ పార్టీ బాధ్యుడు కొబగాపు సుధాకర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఇచ్ఛాపురంలో: బస్టాండ్ వద్ద వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ధర్నా చేశారు. అనంతరం విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఎస్. దేవరాజు, కె.మోహనరావు, ఎం. వెంకటి తదితరులు పాల్గొన్నారు.