రాష్ట్ర విభజన సమస్య పరిష్కారం కోసం తెలంగాణ నేతలతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల చర్చలు జరిపారు. సీఎల్పీలో మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డిని సీమాంధ్ర మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, గంటా శ్రీనివాసరావు కలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా సీడబ్ల్యూసీ ప్రకటన, తదనంతరం తలెత్తిన పరిస్థితులపై ఇరు ప్రాంతాలు నాయకులు చర్చలు జిరిపినట్టు తెలిసింది.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తమ పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేయాలని హైకమాండ్ను ఆ ప్రాంత నాయకులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరు ప్రాంతాల కాంగ్రెస్ నేతల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
జానా, పొంగులేటితో సీమాంధ్ర మంత్రుల భేటీ
Published Thu, Sep 19 2013 2:26 PM | Last Updated on Sat, Aug 11 2018 7:11 PM
Advertisement
Advertisement