విజయవాడలో సంచలనాలు
► ఈ ఏడాది జనవరి 30న భవానీపురంలో విద్యుత్ షాక్‌కు గురై ఐదుగురు మృతిచెందారు. వన్‌టౌన్‌లోని కేఎల్‌రావునగర్‌లో సిలిండర్ పేలి నలుగురు అశువులుబాశారు.
► ముంబయిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గాచేస్తున్న మచిలీపట్నంకు చెందిన అనూహ్య హత్యాచార ఘటనలో నిందితుడు చంద్రభానుకు అక్టోబర్‌లో ముంబయి కోర్టు ఉరిశిక్ష విధించింది.
► రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు ఆగస్టు 19న తన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించి 15 రోజులు ఇక్కడి నుంచే పాలన కొనసాగిస్తామని ప్రకటించారు. కానీ ఆచరణలో మాత్రం అమలు కాలేదు.
► జులైలో మాచవరం స్టేషన్ పరిధిలో బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది.
► హిమబిందుపై అత్యాచారం, హత్య కేసులో పోలీసులు చార్జిషీటు దాఖలు చేయగా, జులై 28న ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
► సీఎం క్యాంపు కార్యాలయం ఉన్న సూర్యారావుపేటను హై సెక్యూరిటీ జోన్‌గా పోలీసులు ప్రకటించారు. అక్కడ ఆగస్టు 1న రెండు గంటల్లో ఆరు దొంగతనాలు జరిగాయి.
► అంతర్రాష్ట దొంగ సాహును విజయవాడ పోలీసులు జూన్ 6న అరెస్ట్ చేశారు.
► విజయవాడ పోలీస్ బ్రాండ్ అంబాసిడర్ సాయికుమార్‌ను నియమించారు.
► కృష్ణలంక స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్‌లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృత్యువాత పడిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది.
► విజయవాడలో బయటపడిన కాల్‌మనీ సెక్స్ రాకెట్ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతోపాటు పలువురు నేతలకు సంబంధాలు ఉండటం విశేషం. మొగల్రాజపురం ప్రాంతానికి చెందిన ఒక మహిళా టైలర్ జ్యోత్స్నరెడ్డి తన వ్యాపార అవసరాల కోసం పటమట ఎన్‌టీఆర్ సర్కిల్ వద్ద పంటకాలువ రోడ్డులో ఉన్న కాల్‌మనీ వ్యాపారులను ఆశ్రయించింది. రోజువారీ వడ్డీకి వీరు డబ్బులు ఇస్తారు. ఈ నేపథ్యంలోనే ఆమెను వారు లొంగదీసుకున్నారు. ఆమె సీపీ గౌతమ్ సవాంగ్‌కు ఫిర్యాదు చేయడంతో కాల్‌మనీ, సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చాయి.
► విజయవాడ కేంద్రంగా కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలపై దాడులు చేశారు.