‘అమరావతి వద్దు.. అభివృద్ది వికేంద్రికరణ ముద్దు’ | Several Unions Protest Rally To Support CM Jagan 3 Capital Idea In AP | Sakshi
Sakshi News home page

మూడు రాజధానులకు మద్దతుగా పలు సంఘాల ర్యాలీ

Published Sat, Jan 11 2020 1:27 PM | Last Updated on Sat, Jan 11 2020 2:23 PM

Several Unions Protest Rally To Support CM Jagan 3 Capital Idea In AP - Sakshi

సాక్షి, కర్నూలు: అమరావతి వద్దు.. అభివృద్ధి వికేంద్రికరణ ముద్దు అంటూ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు నినాదాలు చేశాయి. రాజధాని వికేంద్రీకరణకు సంఘీభావం తెలుతున్నాయి. ఈ సందర్భంగా సంఘ నేతలు మాట్లాడుతూ..  రాజధాని రైతుల పేరుతో అమరావతిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టే బస్సు యాత్రను అడ్డుకుంటామని తెలిపారు. చంద్రబాబు, సీపీఐ అధ్యక్షుడు రామకృష్ణ , ఆ పార్టీ నేతలు రాయలసీమ ద్రోహులుగా  మిగిలిపోతారని విద్యార్థులు మండిపడ్డారు. 

చిత్తూరు జిల్లా: మూడు రాజధానులకు మద్దతు తెలుపుతూ నగరి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. నియోజకవర్గంలోని క్లాక్‌ టవర్‌ నుంచి ఓంశక్తి ఆలయం వరకు చేపట్టిన ఈ భారీ ర్యాలీలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీకాకుళం జిల్లా: విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ప్రతిపాదనకు మద్దతుగా ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్బంగా వేదిక అధ్యక్షులు మాట్లాడుతూ.. రాజధాని 29 గ్రామాల సోత్తు కాదని, రాష్ట్ర ప్రజలందరిదన్నారు. అలాగే అధికార వికేంద్రికరణతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement