శంషాబాద్ విమానాశ్రయానికి గరుడ సర్వీస్ | Shamshabad airport, Imperial Service | Sakshi
Sakshi News home page

శంషాబాద్ విమానాశ్రయానికి గరుడ సర్వీస్

Published Sat, Nov 1 2014 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM

Shamshabad airport, Imperial Service

విజయవాడ : వేకువజామునే హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా శనివారం నుంచి గరుడ సర్వీసును నడపనున్నట్లు విజయవాడ డిపో మేనేజర్ నాగశేషు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేకువజామున శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరే విమానాల్లో వెళ్లే వారి సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

విజయవాడలో రాత్రి పది గంటలకు బయలుదేరి మియాపూర్ వెళ్లే గరుడ సర్వీసును మెహిదీపట్నం, గచ్చిబౌలి, శంషాబాద్ ఎయిర్‌పోర్టు మీదుగా మియాపూర్ వెళ్లేలా మార్పు చేశామని తెలిపారు. ఈ బస్సు వేకువజామున నాలుగు గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుతుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement