ఒంగోలు టౌన్ : పింఛన్లపై సర్వే నిర్వహిస్తున్నందున అర్హత గలవారు వారివారి గ్రామాలకు వెళ్లి సర్వే చేస్తున్న అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ విజయకుమార్ సూచించారు. స్థానిక ప్రకాశం భవనంలోని ఓపెన్ ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అర్జీదారులు తమకు పింఛన్లు ఇప్పించాలంటూ కలెక్టర్‌ను వేడుకున్నారు.
ఆయన మాట్లాడుతూ వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు మంజూరై మధ్యలో నిలిచిపోయినవారు, ప్రస్తుతం పింఛన్లు పొందుతున్నవారికి ఏమైనా సమస్యలుంటే సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారిని సంప్రదించాలని తెలిపారు. సర్వే నిమిత్తం గ్రామాలకు వచ్చే అధికారుల బృందం వద్ద సమస్యలు పరిష్కారం కాకుంటే ప్రజావాణిలో విన్నవించుకోవాలని సూచించారు.
పింఛన్లకు దరఖాస్తు చేసుకోండి
Published Tue, Sep 23 2014 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM
Advertisement
Advertisement