ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : మాతాశిశు మరణాలను తగ్గేలా చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ సిస్టమ్ స్ట్రెంథింగ్ రాష్ట్ర టీం లీడర్ డేవిడ్ దమారా అన్నారు. బుధవారం ఆదిలాబాద్‌లోని టీటీడీసీలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, సీడీపీవోలకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్ వాడీ కేంద్రాలను పటిష్టం చేయాలన్నారు.
పరిస్థితిపై రోజూ ఆన్‌లైన్ రిపోర్టు పంపాలన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రజలకు పోషక విలువలు, పరిశుభ్రతపై వివరించాలన్నారు. పిల్లలకు ఆటాపాటాలు నేర్పించాలన్నారు. బాలింతలు పిల్లలకు ఆరు నెలలపాటు ముర్రుపాలు తాగించేలా చూడాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ సిస్టమ్ స్ట్రెంథింగ్ రీజినల్ మేనేజర్ నర్సింహామూర్తి, సీడీపీవోలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
మాతాశిశు మరణాలను తగ్గించాలి
Published Thu, Feb 27 2014 5:05 AM | Last Updated on Sat, Jun 2 2018 8:42 PM
Advertisement
Advertisement