సూత్రధారుల గుట్టు రట్టయ్యేనా? | Silent rattayyena sutradharula | Sakshi
Sakshi News home page

సూత్రధారుల గుట్టు రట్టయ్యేనా?

Published Wed, Nov 19 2014 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 4:41 PM

Silent rattayyena sutradharula

యూనివర్సిటీ: ఎస్కేయూలో భారీ కుంభకోణంపై విచారణ కమిటీ చేపడుతున్న దర్యాప్తు రోజుకో మలుపుతిరుగుతోంది. ప్రతిరోజూ కొత్త బినామీ ఖాతాలు బయటపడుతున్నాయి. దీంతో ఆఖాతాలను సీజ్ చేస్తున్నారు. ఏక కాలంలో హైదరాబాదు, బెంగుళూరుల్లోని వివిధ బ్యాంకు  ఖాతాలకు నగదును జమ చేయడంపై దర్యాప్తు కమిటీ  నివ్వెరపోతోంది.

తెరవెనుక సూత్రధారుల ప్రమేయం లేనిదే ఇంత పెద్ద మొత్తంలో డబ్బు దారి మళ్లించే సాహసం చేయలేరని తెలుస్తోంది. భారీగా సొమ్ము స్వాహా చేసిన  ఫైనాన్స్ విభాగపు ఉద్యోగులు ఉదయభాస్కర్‌రెడ్డి, శేషయ్య ఇప్పటికే పరారీలో ఉండగా, వీరిని నడిపించిన సూత్రధారుల్లో గుబులు రేగుతోంది.

 పీహెచడీ అడ్వాన్స్ ఇంక్రిమెంట్లను కొల్లగొట్టారు:
 ఎస్కేయూలోని భోదనా సిబ్బందికి చెల్లించిన జీతాల్లో ఫీహెచ్‌డీ ఇంక్రిమెంట్ల రూపంలో రూ.1,30,69,284 లను చెల్లించారు. సాధారణంగా ఫీహెచ్‌డీ ఇంక్రిమెంట్లను అసిస్టెంట్ ప్రొఫెసర్లుకు మాత్రమే చెల్లించాలి. తద్భిన్నంగా భోదనా సిబ్బంది అందరికీ చెల్లించారు. ఈ నిబంధనలకు పరిగణలోకి తీసుకున్న ఆడిట్ విభాగం ఎక్కువగా చెల్లించిన ఇంక్రిమెంట్లను రికవరీ చేయాలని 2013 ఏప్రిల్ న రిజిస్ట్రార్ ఆచార్య గోవిందప్పకు సూచించారు.

దీంతో తప్పును సరిదిద్దుకొన్న వర్సిటీ యాజమాన్యం వెంటనే వారి జీతాల నుంచి ఈ మెత్తాలను మినహాయించాలని ఆదేశాలు జారీ చేసింది. వీటిలో నుంచి రూ.99,62,562లను చెల్లించారు. తక్కిన రూ.31,33,722లను వెనక్కి తిరిగి చూడకుండా స్వాహా చేసేశారు. వీటికి సంబందించిన వివరాలను ఆడిట్ వాళ్లు అడిగినా కూడా కాలయాపన చేయడంతో పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది.

 బ్యాంకు అధికారులకు బాధ్యత లేదా?..
 ఖాతాను ప్రారంబించేటపుడు సవాలక్ష వివరాలను అడిగే బ్యాంకర్లు బినామీ ఖాతాల్లోకి జమ చేసేటపుడు ఎందుకు ఆరాతీయలేదనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. జీతాలను నేరుగా బినామీ ఖాతాల్లోకి మళ్లించినపుడు ఏర్పడే వ్యత్యాసాన్ని ఎందుకు పసిగట్టలేక పోయాయి. కేవ లం ఫెన్‌డ్రైవ్ తీసుకవచ్చిన సమాచారాన్ని ,హార్డ్ కాపీలో ఉన్న సమాచారాన్ని సమతుల్యత తేదని ఎందుకు ప్రశ్నించలేదు.

ఫెన్‌డ్రైవ్‌ను బ్యాంకులోకి తీసుకెళ్లి ఉదయభాస్కర్‌రెడ్డితోనే ఆన్‌లైన్‌లోకి నగదును వేసేలా కంప్యూటర్ ఆపరేట్ చేసే అంత చొరవ ఒక వర్సిటీ ఉద్యోగికి ఎందుకు ఇచ్చినట్లు? బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయిన విజువల్సే ఇందుకు సజీవసాక్షాలు. ప్రస్తుతం నూతన బ్యాంకు మేనేజర్ రాకతో ఈ విషయం  బట్టబయలైంది. దీంతో గతంలో పనిచేసిన వారికీ ఈ వ్యవహారంతో సం బంధం ఉందన్న  అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 ఆడిటింగ్ అభ్యంతరాలనూ విస్మరించారు..
 ప్రతి నెలా జీతాల బిల్లులో ఆఫీసర్స్, టీచింగ్ స్టాఫ్, నా న్‌టీ చింగ్‌స్టాఫ్, హాస్టల్ స్టాఫ్, ఫెన్షన్ ఎంత చెల్లిస్తున్నామనే వి వరాలను ఆడిటింగ్‌కు తెలుపుతున్నారు. కానీ వీరిలో ఎవరు టీచింగ్, నాన్‌టీచింగ్ అనే పూర్తి వివరాలు ఇవ్వాలని ఆడిటింగ్ వారు కోరినా నిరాశే ఎదురైందన్నది వారి రిపోర్టు తెలయిచేస్తోంది.

మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన బ్లాక్ గ్రాంట్స్ లో దారి మళ్లించకుండా జాగ్రత్త వహించి దూరవిద్య  ఆదాయం,పెన్షన్స్ ,బెనిఫిట్స్ , ఇంక్రిమెంట్లు, వర్సిటీ ఇతర అంతర్గతవనరులకు కన్నం వేశారు. ఎందుకుంటే ప్రతి మూడు నెలలకు వినియోగ పత్రాలను ఆడిట్ విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి పంపడంతో చిక్కిపోతామనే  జాగ్రత్త వహించారు.
 
 సీబీఐతో విచారణ చేయించాలి విద్యార్థి సంఘాల డిమాండ్
 యూనివర్సిటీ: ఎస్కేయూలోని భారీ కుంభకోణాన్ని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నేతలు మంగళవారం వర్సిటీలో ఆందోళనకు దిగారు. వీసీ కే లాల్‌కిశోర్ తన చాంబర్‌లో విచారణ కమిటీ అధికారులతో సమావేశమై ఉండగా ఆందోళనకారులు చాంబర్‌లోకి చొరబడ్డారు. దీంతో చాంబర్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఆందోళనకారులను అదుపుచేశారు.

విద్యార్థి నాయకులు వీసీతో వాగ్వాదానికి దిగారు. నిధుల స్వాహాకు సంబంధించిన వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని ప్రశ్నించారు. వివరాలను వెల్లడించాలని   వైఎస్సార్ విద్యార్థి విభాగం స్టేట్ స్టీరింగ్ కమిటీ మెంబర్ జీవీ లింగారెడ్డి, రవి, క్రాంతికిరణ్, సోమేష్‌కుమార్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు  రామాంజనేయులు, నాగరాజు, ఐకాస నేతలు బాలస్వామి, పరుశురాంనాయక్, కొంకా మల్లిఖార్జున,ఓబులేసు తదితరులు డిమాండ్ చేశారు.   

విచారణ కమిటీ కన్వీనర్ ఆచార్య రెడ్డి వెంకటరాజు  వెల్లడించిన వివరాలు  ఆయన మాటల్లో...
‘ఎస్కేయూ వర్సిటీ బోధనా సిబ్బందికి సంబంధించి  ఈ నెల 6న ఉదయ భాస్కర్‌రెడ్డి ఖాతాలోకి రూ.11 లక్షలు ఆరు ఖాతాల్లోకి జమ కావడంతో బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీనిపై తనిఖీ నిర్వహించడంతో గుట్టు బయటపడింది.  

ఈ నెల జీతాల చెల్లింపుల ఖాతాను (హార్డ్ కాపీ)నిర్వహించకపోవడంతో కూపీ లాగడంతో అవినీతి భాగోతం బయటపడింది. వర్సిటీ ఉద్యోగుల నుంచి జీతాలను తమ ఖాతాలోకి మార్చుకోవడం, అరియర్స్, కరువు భత్యం, పెన్షన్లలో అందినకాడికి దారి మళ్లించినట్లు గుర్తించాం.   

నిన్న, నేడు మరో రెండు బినామీ ఖాతాలు బయటపడ్డాయి.  ఉదయభాస్కర్‌రెడ్డి పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్లు 1.45 కోట్లు ఉన్నాయి. ఆయన కుటుంబసభ్యుల పేర్లతో 11 ఖాతాల్లోకి నిధులు మళ్లించినట్లు రూఢీ అయింది. శేషయ్య ఆయన కుటుంబసభ్యులకు రెండు బినామీ ఖాతాలు ఉన్నాయి.  వీరితో పాటుగా ఆర్థిక నేరాలకు పాల్పడిన వ్యక్తుల వివరాలు విచారణ సమయంలో బయటపెట్టడం అనేతికం. ఈ వివరాలను రహస్య నివేదికలో అందజేస్తాం.’ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement