సిరి మోటార్స్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం రాజప్ప
ఆల్కాట్‌తోట(రాజమండ్రి) : యమహా ఆథరైజ్డ్ డీలర్ సిరి మోటార్స్ షోరూంను స్థానిక వీఎల్‌పురం సెంటర్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప గురువారం ప్రారంభించారు. తొలుత రిబ్బన్ కట్ చేసి షోరూంను ప్రారంభించిన ఆయన అనంతరం జ్యోతిప్రజ్వలన చేశారు. మొదటి కొనుగోలును రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి, స్కూటర్ జోన్‌ను కొత్తపేట ఎమెల్యే చిర్ల జగ్గిరెడ్డి, స్పేర్స్ కౌంటర్‌ను మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, వర్కుషాపును రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, వర్కుషాపు కస్టమర్ లాంజ్‌ను నగర డిప్యూటీమేయర్ వాసిరెడ్డి రాంబాబు ప్రారంభించారు.
ముందుగా ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 12.56 గంటలకు సిరి మోటార్స్ మేనేజింగ్ పార్టనర్ వీధి రామ్‌ప్రసాద్, పార్టనర్ చింతం తమ్మయ్యనాయుడు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కస్టమర్లకు వాహనం కొనుగోలు నుంచి ఉత్తమమైన సేవలందిస్తామన్నారు. ఈ సందర్బంగా నిమ్మకాయల చినరాజప్పను యమహా బైక్‌పై ఎక్కమనగా ఆయన ఎంతో ఉత్సాహంగా బైక్‌పై కూర్చున్నారు. యమహా మోటార్స్ ఇండియా సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రీజనల్ బిజినెస్ హెడ్ కె.భానుప్రకాష్‌రాజు, రీజనల్ సర్వీస్ హెడ్ ఎ.సత్యనారాయణ, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బైర్రాజు ప్రసాదరాజు, జిల్లా టీడీపీ కార్యదర్శి రె డ్డి సుబ్రహ్మణ్యం, డీసీసీబీ మాజీ డెరైక్టర్ ఆకులరామకృష్ణ, విక్టరీ ట్రేడర్స్ అధినేత గొలుగూరి వెంకటరెడ్డి, వేగుళ్ల లీలాకృష్ణ, పప్పుల శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు.