
సాక్షి, విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ది ఫెడరేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజస్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు తెలిపారు.శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరగాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనని పేర్కొన్నారు. వికేంద్రీకరణ జరిగితేనే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అభివృద్ది అంతా ఒకే చోట జరిగితే ఏం జరుగుతుందో హైదరాబాద్ విషయంలో ప్రత్యక్షంగా చూశామని.. మళ్ళీ అలాంటి తప్పు జరగకూడదని తెలిపారు.
దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ఇచ్చిన పరిశ్రమల రాయితీ వల్ల రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని.. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పరిశ్రమల రాయితీలను నిర్లక్ష్యం చేశాయని చెప్పారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన 8 నెలల లోపే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారని..అందుకే ఆయనపై నమ్మకం ఉందని ప్రతినిధులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment