అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న వాహనాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఏఆర్ కానిస్టేబుల్ పై స్మగ్లర్లు దాడి చేశారు.
తిరుపతి : అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న వాహనాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఏఆర్ కానిస్టేబుల్ పై స్మగ్లర్లు దాడి చేశారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా బీఎన్.కండ్రిగ మండలం పదో మైలు వద్ద సోమవారం జరిగింది. అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్నారని సమాచారం అందడంతో ఇన్‌ఫార్మర్ దయాళ్‌తోపాటు ఏఆర్ కానిస్టేబుల్ రమేష్ పదో మైలు వద్ద వేచి ఉన్నారు.
కాగా ఈ విషయం తెలుసుకున్న స్మగ్లర్లు రెండు వాహనాలలో వచ్చి వీరిపై దాడికి పాల్పడ్డారు. స్మగ్లర్లు కత్తులతో దాడి చేయడంతో ఏఆర్ కానిస్టేబుల్ రమేష్ తలకు తీవ్రగాయం అయింది. స్మగ్లర్ల దాడి నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన వారిరువురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.