
తెలంగాణ బిల్లులో అనేక లోపాలు: డొక్కా
తెలంగాణ బిల్లుపై చర్చ జరగాల్సిందేనని రాష్ట్ర మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో అనేక లోపాలున్నాయని, శాసనసభలో దాని గురించి మాట్లాడేందుకు తమకు అవకాశం వస్తే మాత్రం బిల్లులో ఉన్న లోపాలేంటో చెబుతామని అన్నారు.
అసలు రాష్ట్ర విభజనతో సంబంధం లేకుండా 2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల వారికి కేటాయించే నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని ఆయన డిమాండు చేశారు.