
సైన్స్ ల్యాబ్‌లో కింద పడి ఉన్న పరికరాలు, రాళ్లు
లావేరు : లావేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల సైన్స్‌ల్యాబ్‌లో పరికరాలను కొందరు అపరిచిత వ్యక్తులు పగులగొట్టారు. అంతటితో ఆగకుండా గోడలు, కిటికీ తలుపులపై అశ్లీల పదజాలంతో రాతలు రాశారు. పాఠశాల ఆవరణలో అంసాంఘిక కార్యకలాపాలు నిర్వహించారు. సోమవారం పాఠశాల హెచ్‌ఎం పట్నాన రాజారావు, ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చే సరికి గోడలపై అసభ్య రాతలు, వరండాలో మద్యం సీసాలు గుర్తించారు. కిటికీ తలుపులు పగులగొట్టి ల్యాబ్‌లోకి రాళ్లు విసిరినట్లు గుర్తించారు. దీనిపై హెచ్‌ఎం రాజారావు ఉపాధ్యాయులతో కలసి లావేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై కృష్ణారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment