నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: సాఫ్ట్‌వేర్ సమస్యలు తలెత్తడంతో ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం జరుగుతోంది. ఒక వైపు ఆధార్, మరోవైపు ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందించకపోతే సకాలంలో స్కాలర్‌షిప్పులు ఇచ్చేదిలేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. స్కాలర్‌షిప్పునకు దరఖాస్తు చేసేందుకు విద్యార్థులు పడుతున్న అగచాట్లు అన్నీఇన్నీ కావు. ప్రభుత్వ మీసేవా కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తోంది. అయితే మీసేవా కేంద్రాల్లో సాఫ్ట్‌వేర్ లోపం వల్ల ధ్రువీకరణ పత్రాల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గంటలకొద్ది మీసేవా కేంద్రాల వద్ద విద్యార్థులు పడిగాపులు కాస్తున్నారు. హైదరాబాద్ స్థాయిలోనే సాఫ్ట్‌వేర్‌లో సమస్య ఏర్పడిందని సిబ్బంది చెబుతున్నారు.
దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 85 వేల మందికి పైగా విద్యార్థులు స్కాలర్‌షిప్పులు పొందుతున్నారు. వీరిలో సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఎస్సీలు 25 వేలు, బీసీ సంక్షేమ శాఖ ద్వారా 35 వేలు, ఈబీసీలు 14 వేలు, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా కేవలం 3 వేలు , వికలాంగులు 500 మంది స్కాలర్‌షిప్పు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు 40 శాతం మంది మాత్రమే రెన్యువల్ చేసుకున్నారు. రెన్యువల్‌కు గడువు మూడు నెలలు మాత్రమే ఉంది.
బయోమెట్రిక్ విధానం ద్వారా స్కాలర్‌షిప్
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి బయోమెట్రిక్ ద్వారా స్కాలర్‌షిప్పులు మంజూరు చేస్తోంది. గతంలో తహశీల్దార్, మండల అభివృద్ధి అధికారులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అధికారులుగా వ్యవహరించేవారు. ఈ ఏడాది బయోమెట్రిక్ విధానం అమల్లోకి వచ్చింది. ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు సంబంధిత కళాశాల ప్రిన్సిపల్ లాగిన్‌లోకి వస్తాయి. బయో మెట్రిక్ మిషన్‌లో విద్యార్థి, ప్రిన్సిపల్ బోటనవేలు, ఈ రెండు సరిపోలితేనే విద్యార్థికి స్కాలర్‌షిప్ వస్తుంది.
మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలి :
పెంచలరెడ్డి, ఏజేసీ
స్కాలర్‌షిప్పులకు దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 31 వరకు గడువుంది. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాఫ్ట్‌వేర్ సమస్యను త్వరగా పరిష్కరిస్తాం.
సాఫ్ట్‌వేర్ చిక్కులు
Published Fri, Dec 13 2013 3:39 AM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM
Advertisement
Advertisement