నెల్లూరు(బృందావనం): స్థానిక భక్తవత్సలనగర్‌లోని కేఎన్‌ఆర్‌ఎం ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా జరుగుతున్న స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల యోగా చాంపియన్‌షిప్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో నెల్లూరు జిల్లా క్రీడాకారులు అండర్-14,17,19 విభాగాల్లో ప్రతిభచాటి 188 పాయింట్లు సాధించి ఓవరాల్ చాంపియన్లుగా నిలిచారు.
తదుపరి స్థానాన్ని గుంటూరు 130 పాయింట్లతో సాధించింది. విజేతలకు మంగళవారం రాత్రి పాఠశాల హెచ్‌ఎం విజయప్రకాష్‌రావు, స్థానిక కార్పొరేటర్ ఎర్రబోలు అపర్ణ, వైద్యులు పీఎల్ రావు, వైదేహి బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. వారు మాట్లాడుతూ గెలుపు, ఓటమిని సమానంగా స్వీకరించాలన్నా రు. బాల్యం నుంచి యోగా సాధన చేయడం అభినందనీయమన్నారు. యోగాతో ఎటువంటి రుగ్మతలు దరిచేరవన్నారు. శారీరక దారుఢ్యాన్ని, మానసికోల్లాసాన్ని కలిగించే క్రీడలను ఎంచుకుని విద్యార్థులు తమ జీవితంలో ఉన్నతస్థితికి ఎదగాలని ఆకాంక్షించారు. విజేతల వివరాలను టోర్నమెంట్ నిర్వాహకులు యోగా శిక్షక్ ముప్పిరాల లక్ష్మీనరసింహశాస్త్రి, ఎస్జీఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ విక్టర్ విలేకరులకు తెలిపారు. ఎంఎల్‌ఎన్‌శాస్త్రి మాట్లాడుతూ సేవాభారతి- క్రీడాభారతి సౌజన్యం తో ఈ పోటీలు నిర్వహించామన్నారు. కార్యక్రమంలో పీఈటీ అజయ్‌కుమార్, టోర్నమెంట్ పరిశీలకులు వెంకటేశ్వర్లు, వివిధ జిల్లాలకు చెందిన పీఈటీలు, న్యాయనిర్ణేతలు పాల్గొన్నారు.
విజేతల వివరాలు
అండర్-14 -బాలుర విభాగంలో : నెల్లూరు, విజయనగరం, వైఎస్‌ఆర్ కడప,
అండర్-17-బాలురు : నెల్లూరు, గుంటూరు, కృష్ణా
అండర్-14-బాలికలు: విజయనగరం, వైఎస్‌ఆర్ కడప, నెల్లూరు,
అండర్-17-బాలికలు : నెల్లూరు, కర్నూలు, కృష్ణా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
వ్యక్తిగత విభాగంలో..
అండర్-14 -బాలురు : టి.ఎర్రంనాయుడు(నెల్లూరు),సి.కృష్ణవంశీ(విజయనగరం), ఆర్.ప్రియతమ్‌శ్రీరామ్(నెల్లూరు)
అండర్-14-బాలికలు: వై.జోష్ణవి(నెల్లూరు), కె.పద్మజ (వైఎస్‌ఆర్ కడప), టి.అనూష (విజయనగరం)
అండర్-17-బాలురు : ఏవీఎస్‌ఎస్ తరుణ్(గుంటూరు),ఎస్.ఢిల్లేశ్వరరావు(నెల్లూరు), ఆర్.ఎస్ జ్ఞానేశ్వర్ (చిత్తూరు)
అండర్-17-బాలికలు : ఎస్.పూర్ణమ్మ (నెల్లూరు), యు.తనూజ(నెల్లూరు), కె.జ్యోతిప్రియ (నెల్లూరు)
అండర్-19-బాలురు : ఎం.ఎస్.వెంకటరమణ (నెల్లూరు), ఎం.వంశీకృష్ణభరద్వాజ్ (నెల్లూరు), వి.దినేష్ (నెల్లూరు)
అండర్-19-బాలికలు : ఎ.సాయిమౌనిక(గుంటూరు), కె.జోషిత(నెల్లూరు), ఎం.దివ్య మాలిక(నెల్లూరు)మొదటిమూడు స్థానాల్లో నిలిచారు.
ఆర్టిస్టిక్ విభాగంలో..
అండర్-14-బాలురు-టి.ఎర్రంనాయుడు(నెల్లూరు)
బాలికలు-వై.జోష్ణవి(నెల్లూరు)
అండర్-17-బాలురు-ఎంవీ కార్తీకేయన్(నెల్లూరు)
బాలికలు- ఎస్.పూర్ణమ్మ(నెల్లూరు)
అండర్-19-బాలురు- ఎం.ఎస్ వెంకటరమణ(నెల్లూరు)
బాలికలు-ఏ సాయిమౌనిక(గుంటూరు)
రిథమిక్ విభాగంలో..
అండర్-14-బాలురు- ఎల్.మహేష్ (నెల్లూరు)
బాలికలు- ఎ.లిఖిత (నెల్లూరు)
అండర్-17-బాలురు- ఎస్.ఢిల్లేశ్వరరావు (నెల్లూరు)
బాలికలు- యు.తనూజ (నెల్లూరు)
అండర్-19-బాలురు- ఎస్.గణేష్‌రాఘవేంద్రరావు (నెల్లూరు)
బాలికలు-కె.జోషిత (నెల్లూరు) విజేతలుగా నిలిచి జాతీయస్థాయి పోటీలకు అర్హతసాధించారు.
అంతర్ జిల్లాల యోగా చాంపియన్ నెల్లూరు
Published Wed, Dec 24 2014 2:56 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement