శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరుడి రథోత్సవంలో స్వల్పంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. బుధవారం ఉదయం స్వామి రథోత్సవం వైభవంగా ప్రారంభం కాగా... కొందరు భక్తులు రథం మధ్యలోకి ప్రవేశించి లాగే ప్రయత్నం చేశారు.
ఆ సమయంలో తొక్కిసలాట చోటుచేసుకోగా, పోలీసులు వెంటనే స్పందించి వారిని అదుపు చేశారు. రథం మధ్యలో నుంచి లాగరాదని, అటు చివర, ఇటు చివర నుంచే లాగాలని మైకులో ప్రకటన కూడా చేశారు. దీంతో కొద్దిసేపట్లోనే పరిస్థితి చక్కబడింది.