నెల్లూరు (దర్గామిట్ట): శాశ్వత ఉద్యోగులు కావాలనే ఆర్టీసీ కాంట్రాక్ట్ సిబ్బంది కల కొందరికే నెరవేరింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలువురు డ్రైవర్లు, కండక్టర్లను శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు బుధవారం రాత్రి ఆర్టీసీ కార్యాలయానికి అందాయి. ఈ నెల ఒకటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గురిం్తపు పొందుతారు. వీరికి ప్రభుత్వ నుంచి లభించే అన్ని రాయితీలు వర్తిస్తాయి. 2012 డిసెంబర్ 31వ తేదీలోపు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దీంతో 57 మంది కాంట్రాక్ట్ డ్రైవర్లు, కండక్టర్లు ఉద్యోగులు పర్మినెంట్ అయ్యారు. వీరిలో 20 మంది డ్రైవర్లు, 37 మంది కండక్టర్లు ఉన్నారు.
మరికొందరికి అన్యాయం
ఆర్టీసీలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓతో కొందరిలో ఆనందం, మరికొందరిలో ఆవేదన నింపింది. 2012 డిసెంబర్‌కు ముందు చేరి ఇప్పటి వరకు రెగ్యులర్‌గా విధులు నిర్వహించిన వారికే జీఓ వర్తిస్తుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే 2012 డిసెంబర్‌కు ముందు దాదాపు 150 మంది డ్రైవర్లు, కండక్టర్లుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధుల్లో చేరారు. కొన్ని కారణాలతో అందరూ రెగ్యులర్‌గా విధులు నిర్వహించలేక పోయారు. ప్రభు త్వ తాజా ఉత్తర్వులతో దాదాపు 130 మంది ఉద్యోగులకు అన్యాయం జరిగిందని పలు ఆర్టీసీ యూనియన్ సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కేవలం ఆర్టీసీ జిల్లా అధికారుల తప్పిదం కారణంగానే మిగిలిన ఉద్యోగులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా లోపాలను సరిదిద్ది మిగిలిన వారిని కూడా శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.
హర్షం : ఆర్టీసీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేస్తున్న కొందరు డ్రైవర్లు, కండక్టర్లను పర్మినెంట్ చేయడంపై నేషనల్ మజ్దూర్ యూనియన్ రీజనల్ కార్యదర్శి రమణరాజు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఇదే విషయమై ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ కార్యదర్శి శ్రీనివాసులురెడ్డి కూడా ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. మిగిలిన ఉద్యోగులను కూడా పర్మినెంట్ చేయాలని వారిద్దరూ వేర్వేరుగా కోరారు.
కొందరి కలే నెరవేరింది..
Published Thu, Sep 4 2014 2:38 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
Advertisement
Advertisement