
దేవీచౌక్ (రాజమహేంద్రవరం): ఐదేళ్ల పాలనలో చంద్రబాబు రాజధాని పేరిట విఠలాచార్య సినిమా చూపి.. ఇప్పుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి, రాజధాని రెండూ వేర్వేరు అంశాలని.. పరిపాలనా సౌలభ్యానికి మాత్రమే రాజధాని అని.. దీనిపై చంద్రబాబు గగ్గోలు పెట్టడం అనవసరమన్నారు. చంద్రబాబు రూ.640 కోట్లు వెచ్చించి వర్షం వస్తే లీకయ్యే నిర్మాణాలు చేశారని దుయ్యబట్టారు.