ప్రతిష్టాత్మకంగా మహిళా పార్లమెంటు | Speaker Kodela comments on Women's Parliament | Sakshi
Sakshi News home page

ప్రతిష్టాత్మకంగా మహిళా పార్లమెంటు

Published Sun, Jan 22 2017 1:54 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

ప్రతిష్టాత్మకంగా మహిళా పార్లమెంటు - Sakshi

ప్రతిష్టాత్మకంగా మహిళా పార్లమెంటు

అమరావతి వేదికగా ఫిబ్రవరి 10 నుంచి మూడు రోజులపాటు ప్రతిష్టాత్మకంగా జాతీయ మహిళా పార్లమెంటు నిర్వహించేందుకు ముమ్మర

ఫిబ్రవరి 10 నుంచి మూడు రోజులు నిర్వహణ: స్పీకర్‌ కోడెల

సాక్షి, అమరావతి: అమరావతి వేదికగా ఫిబ్రవరి 10 నుంచి మూడు రోజులపాటు ప్రతిష్టాత్మకంగా జాతీయ మహిళా పార్లమెంటు నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నామని సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, వ్యాపార, వాణిజ్య రంగాల మహిళా ప్రముఖులు 12 వేల మందిని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. సదస్సు ఏర్పాట్లపై హైదరాబాద్‌ అసెంబ్లీలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని 2,500 కళాశాలల నుంచి నలుగురు చొప్పున విద్యార్థులు సదస్సులో పాల్గొంటారని చెప్పారు.మహిళా సాధికారత కోసం స్వరాజ్య మైదానం నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకూ ప్రత్యేక పరుగు ఉంటుందని తెలిపారు.

ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు: అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తి కావచ్చిందని, సమావేశాలు ఫిబ్రవరిలో ఉంటాయని స్పీకర్‌ తెలిపారు. అసెంబ్లీ కమిటీ సమావేశాలు హైదరాబాద్‌లో ఉంటాయా? అమరావతిలోనా అని ప్రశ్నించగా అన్ని కమిటీ సమావేశాలు అమరావతిలోనే జరుగుతాయని సమాధానమిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement