సాక్షి, అమరావతి: ఉభయ గోదావరి జిల్లాలో వరద బాధితులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందులో భాగంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలకు ప్రత్యేక సాయంగా రూ. 10 కోట్ల 9 లక్షల 20వేలను విడుదల చేసింది. ఈ మేరకు ఏపీ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. గోదావరి వరదల కారణంగా ఇళ్లు నష్టపోయిన కుటుంబాలకు రూ. 5వేల చొప్పున సాయం అందజేసేందుకు ఈ నిధులను మంజూరు చేసింది.
వరదల కారణంగా ఒకవారంపాటు నీటిలో మునిగిపోయి ధ్వంసమైన, శిథిలమైన ఇళ్లకు సాయంగా రూ. 5 వేల చొప్పున వైఎస్ జగన్ ప్రభుత్వం అందించనుంది. ఈ నిధుల్లో రూ. 7,21,75,000 తూర్పు గోదావరి జిల్లాకు కేటాయించగా.. రూ. 2,87,45,000 పశ్చిమ గోదావరి జిల్లాకు కేటాయించింది. వరద బాధితులను తక్షణమే ఆదుకునేందుకు జిల్లా కలెక్టర్లు ఇచ్చిన సిఫారసుల మేరకు ఈ నిధులను విడుదల చేసింది. వరదల కారణాంగా నష్టపోయిన బాధితులను గుర్తించి వారికి సాయం అందజేయాలని, నిబంధనలకు అనుగుణంగా ఈ సాయం అందుకునే లబ్ధిదారుల పూర్తి వివరాలు సేకరించి.. ప్రభుత్వానికి పంపాలని ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.
గోదావరి జిల్లాలకు రూ. 10 కోట్ల వరద సాయం
Published Wed, Sep 11 2019 2:13 PM | Last Updated on Wed, Sep 11 2019 3:41 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment