మేడారం(గోవిందరావుపేట), న్యూస్‌లైన్ : మేడారం మహాజాతరకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం జంపన్నవాగుపై చేపట్టిన రెండో బ్రిడ్జి నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. సుమారు *3కోట్ల వ్యయంతో గత డిసెంబర్ 9న ఆర్‌అండ్‌బీ అధికారులు పనులను ప్రారంభించారు. అయితే తొలుత జంపన్నవాగు నుంచి వస్తున్న నీటితో నిర్మాణ పనుల్లో జాప్యం నెలకొంది. ఈ సందర్భంగా కూలీ లు జంపన్నవాగుకు వస్తున్న వరద నీటిని వేరే వైపునకు మళ్లించేందుకు బ్రిడ్జి పక్క నుంచి కాలువను తీసి సగభాగం వరకు బెడ్ నిర్మాణం చేపట్టారు.
దీంతో పూర్తయిన పిల్లర్లపై మొదటిస్లాబు పోసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే స్లాబ్ పనులు 15వ తేదీ నుంచి 31వ తేదీలోగా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో బ్రిడ్జి పనులు సకాలంలో పూర్తయితే జాతరలో ట్రాఫిక్ అంతరాయం తగ్గడంతోపాటు, భక్తు లు బ్రిడ్జిపై నడిచేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు.
31లోగా పూర్తి చేసేందుకు చర్యలు..
జంపన్నవాగుపై చేపట్టిన రెండో బ్రిడ్జి నిర్మాణ పనులను ఈనెల 31వ తేదీలోగా నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్‌ఎండ్‌బీ డీఈ వెంకటేశ్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. జంపన్నవాగు నీటి ప్రవాహం కారణంగా మొదట్లో పనుల్లో కొంత జాప్యం జరిగినప్పటికీ ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. బ్రిడ్జిపై మూడు స్లాబులు పూర్తి కాగానే నీటి ప్రవాహాన్ని వేరేవైపు మరల్చి రెండో వైపు కూడా పనులను పూర్తి చేస్తామని తెలిపారు. మొత్తంగా జాతరలోగా భక్తులకు బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తామని ఆయన పేర్కొన్నారు.
చురుగ్గా జంపన్నవాగు రెండో బ్రిడ్జి పనులు
Published Mon, Jan 6 2014 3:49 AM | Last Updated on Tue, Oct 9 2018 5:58 PM
Advertisement
Advertisement