కలుపు మొక్కలే పంటకు శత్రువు
శ్రీకాకుళం అగ్రికల్చర్: వేరుశనగలో కలుపు మొక్కలు ఉంటే పంట ఎదుగుదల తగ్గుతుంది. దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. కలుపునివారణ పద్ధతులను తెలుసుకోకపోవడం వల్లే రైతులకు పెట్టుబడి తడిసిమోపెడవుతోంది. రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. కలుపు మందులు వినియోగించి సరైన యాజమాన్య పద్ధతులు పాటి స్తే పంట లాభసాటిగా ఉంటుందని శ్రీకాకుళం మండల వ్యవసాయాధికారి ఎం.ఉషాకుమారి(88866 12670) అన్నారు. కలుపు నివారణ పద్ధతులను సూచించారు.
కలుపు మొక్కలతోనే నష్టం
వేరుశనగ పంటకు మొదటి శత్రువు కలుపు మొక్కలే. ఇవి వివిధ దశల్లో ఆశించి దిగుబడి తగ్గడానికి కారణమవుతాయి. వేరుశనగ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు సాలుల మధ్య కలుపు మొక్కలు తొందరగా పెరిగి వేరుశనగ పైరుకు పోషక పదార్థాలను విని యోగించుకుంటాయి. భూమి నుంచి నత్రజని 58 కిలోలు, భాస్వరం 8 కిలోలు, పొటాష్ 45 కిలోలు వినియోగించుకుంటాయని పరిశోధనల్లో తేలింది. కలుపు ఎక్కువగా ఉంటే ప్రతి హెక్టారు విస్తీర్ణంలో వేరుశనగ పంట వర్షాధారంగా సాగు చేసినప్పు డు దిగుబడి 22-39 శా తం, ఆరుతడి పంటగా వేరుశనగసాగు చేసినప్పుడు 30-50 శాతం వరకు తగ్గుతుంది. వేరుశనగ పంటలో కలుపు మొక్కల ఉద్ధృతి వర్షాధారంగా సాగు చేసినప్పుడు ఎక్కువగానూ, నీటి పారుదల కింద సాగు చేసినప్పుడు తక్కువగా ఉంటుంది.
పురుగులు, తెగుళ్ల ఉద్ధృతి..
కలుపు మొక్కలు కొన్ని రకాల పురుగులు, తెగుళ్లకు ఆశ్రయమిచ్చి వేరుశనగ పంటకు నష్టం కలుగజేస్తున్నాయి. రైతు సకాలంలో నివారణ చర్యలు చేపట్టకపోతే దిగుబడిపై ప్రభావం చూపుతుంది. వేరుశనగ పంట లో వయ్యారి భామ కలుపు మొక్కలు పూవుల పుప్పొడి అధికంగా ఉన్నప్పుడు కలుపు మొక్కల ద్వారా కాండం కుళ్లు వైరస్ తెగులు వ్యాప్తి చెందుతుంది. వేరుశనగ పంటలో ఎన్నెద్దులాకు, గరిటికమ్మ, ఉత్తరేణి, చినపల్లేరు వంటి కలుపు మొక్క లు కొన్ని రకాల వైరస్ తెగుళ్లను ఆశించి శిలీంధ్రాలకు ఆశ్రయమిస్తాయి. పార్ధీని యం కలుపు మొక్కలు ఉన్న ప్రాంతం నుం చి గాలి, పుప్పొడి రేణువుల ద్వారా తెగులు కారక శిలీంధ్రాలు వేరుశనగ మొక్కలకు చేరుతాయి. తెగులు సోకిన పొద్దు తిరుగుడు పొలం నుంచి పంట మార్పిడి సమయంలో కాండంకుళ్లు వైరస్ తెగులు వ్యాప్తి చెందుతుంది.
కలుపులో రకాలు..
వేరుశనగ పంటను ఆశించే కలుపు మొక్కలు గడ్డి జాతికి చెందినవి. వెడల్పాకులు గల కలుపు మొక్కల్లో తుంగగడ్డి, ఊద, గరిక, ఊదర, చీపురుగడ్డి, కొర్రగడ్డి, ఉర్రంకి, బొంత, కుక్కవామింట, పెదపాయల కూర, గలిజేరు, పల్లేరు, గడ్డి చామంతి, ముళ్ల తోటకూర, నేల ఉసిరి, గురువుగూర, వయ్యారి బామ వంటివి పంటలను నాశనం చేసే కలుపు మొక్కలు.
కలుపు నివారణ ఇలా...
పంటను విత్తిన 25-30 రోజుల్లో కలుపును నిర్మూలించుకోవాలి. విత్తిన 30-35 రోజుల్లో పే కూలీలతో గొప్పు తవ్వి కలుపును నివారిం చాలి. విత్తిన 40-45 రోజుల నుంచి ఉడలు నేల లోకి దిగడం ప్రారంభమౌతుంది. ఈ దశ లో ఎట్టి పరిస్థితిల్లోనూ మొక్కలను, మట్టిని కదపకూడదు. ఒక వేళ ఆలస్యంగా కలుపు తీసే ప్రయత్నం చేస్తే ఊడలు దిగే ప్రక్రియకు అంతరాయం కలిగి కాయల సంఖ్య గణనీయం గా తగ్గిపోతుంది. విత్తిన మూడు రోజుల లోపల ఎకరాకు 1.25-1.5 లీటర్ల అలాక్లోర్ లేదా పెం డి మిథాలిన్ 30 శాతం మందు లేదా బ్యూటాక్లోర్ 50 శాతం మందును ఈ రెండింటి లో ఏదో ఒకదాన్ని 200 లీటర ్ల నీటిలో కలిపి నేలపై సమానంగా పడేలా పిచికారీ చేయూలి.