12 నుంచి హైదరాబాద్లో ఎయిర్ షో | Stage set for India Aviation 2014 in Hyderabad | Sakshi
Sakshi News home page

12 నుంచి హైదరాబాద్లో ఎయిర్ షో

Published Mon, Mar 10 2014 3:48 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

12 నుంచి హైదరాబాద్లో ఎయిర్ షో - Sakshi

12 నుంచి హైదరాబాద్లో ఎయిర్ షో

హైదరాబాద్: భారత విమనయాన మంత్రిత్వ శాఖ ఈ నెల 12 నుంచి ఐదు రోజుల పాటు హైదరాబాద్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనుంది. 18 దేశాలకు చెందిన 250 విమానయాన కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచనున్నాయి. దీనికి బేగంపేట్ విమానాశ్రయం వేదికకానుంది.

ప్రపంచంలో అతిపెద్ద విమానాలు ఎయిర్బస్ ఏ 380, బోయింగ్ 787 సహా 18 ఎయిర్క్రాఫ్ట్ లను ప్రదర్శనకు ఉంచనున్నారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి జి.అశోక్ కుమార్ వివరాలను వెల్లడించారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ ఈ షోను ప్రారంభిస్తారు. ఈ షోలో పాల్గొనే అమెరికా, సింగపూర్, రష్యా తదితర దేశాలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement