చంద్రబాబు, కిరణ్‌లదే విభజన పాపం | state divided by chandrababu and kiran kumar reddy says govardan reddy | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, కిరణ్‌లదే విభజన పాపం

Published Tue, Jan 7 2014 4:47 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

state divided by chandrababu and kiran kumar reddy says govardan reddy

 ముత్తుకూరు, న్యూస్‌లైన్: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ డెరైక్షన్‌లో సీఎం కిరణ్ వేసిన డ్రామాలు, రెండు కళ్ల సిద్ధాంతంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన లేఖ వల్ల రాష్ట్ర విభజన జరుగుతోందని వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ముత్తుకూరులో సోమవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం బస్టాండ్ కూడలిలో కార్యకర్తలు మానవహారం నిర్వహించారు. కాకాణి మాట్లాడుతూ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానంటూ సీఎం కిరణ్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. కొబ్బరి కాయల కథలు చెప్పి చంద్రబాబు విభజనకు పూర్తి సహకరించారన్నారు. రాష్ట్ర చరిత్రలో విభజన ప్రక్రియ ఒక మాయనిమచ్చగా మిగిలిపోతుందన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు జరిగాయని, పార్టీ అధినేత వైఎస్ జగన్ రెండు సార్లు, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఒక సారి ఆమరణ దీక్షలు చేశారని గుర్తు చేశారు.
 
 పోరాడకుంటే భావితరాలు క్షమించవు: డాక్టర్ వరప్రసాద్
ముత్తుకూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా జరి గిన భారీ ప్రదర్శన, మానవహారంలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ వరప్రసాద్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ఇతర పార్టీల నాయకులు ఇప్పటికైనా పోరాటం చేయకుంటే భావితరాలు క్షమించవన్నారు. భారీ ప్రదర్శనలో కార్యకర్తలు పార్టీ పతాకాలు చేపట్టి వైఎస్ జగన్ జిందాబాద్, జోహార్ వైఎస్సార్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, మండల నాయకులు మారు సుధాకర్‌రెడ్డి, ఇసనాక చంద్రశేఖర్‌రెడ్డి, మునుకూరు జనార్దన్‌రెడ్డి, దువ్వూరు గోపాల్‌రెడ్డి, ఈపూరు కోటారెడ్డి, కొడవలూరు రామిరెడ్డి, యానాటి శశిధర్‌రెడ్డి, పార్లపల్లి దిలీప్‌రెడ్డి, ఎర్రంవేణు, టీ రాజ  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement