రైతు నెత్తిన మాఫీ టోపీ
►రుణమాఫీ సొమ్ము వడ్డీలకు జమ
►లబోదిబోమంటున్న రైతులు
►దాళ్వా అవసరాల దృష్ట్యా సొమ్ము
►చేతికివ్వాలని అన్నదాతల వినతి
పాలకొల్లు : వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామంటూ నెలల తరబడి ఊరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా జిల్లా రైతులకు మొక్కుబడిగా నిధులు విది ల్చింది. జిల్లాలోని 256 సహకార సంఘాల్లో సుమారు 2 లక్షల మంది రైతులకు రూ.780 కోట్ల పంట రుణాలను మాఫీ చేయూల్సి ఉంది. ఇందులో మొదటి విడతగా రూ.560 కోట్లను రైతుల ఖాతాలకు జమ చేయూ ల్సి ఉండగా, సర్కారు రూ.190 కోట్లు మాత్ర మే విడుదల చేసింది. ఇందులో రూ.173 కోట్లను రైతుల ఖాతాలకు జమ చేసినట్టు సహకార అధికారులు చెబుతున్నారు. అరుుతే, రైతులకు ఇచ్చిందే అరకొర సొమ్ము కాగా, ఆ కొద్ది మొత్తాలను సైతం సహకార సంఘాలు వడ్డీ రూపంలో జమ చేసుకుంటున్నారుు. ఇంతజరుగుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు కిమ్మనడం లేదు.
మాఫీ అని మట్టి కొడుతున్నారు
రైతులు, డ్వాక్రా మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు అనేక కొర్రీలు వేస్తూ రైతులను ఆయోమయానికి గురి చేశారు. ఒక్కొక్క కుటుంబానికి కేవలం రూ.లక్షన్నర రుణం మాత్రమే మాఫీ చేస్తామని, ముందుగా రూ.50 వేల లోపు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నామని సర్కారు ప్రకటించింది. ఆయన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, ఆధార్ కార్డులు ఉన్నవారికే మాఫీ అంటూ రకరకాల షరతులు విధించారు. ఎన్ని షరతులు విధించినా ఎంతోకొంత సొమ్ము చేతికి అందుతుందని రైతులు భావించారు. రూ.50 వేల లోపు రుణాలు తీసుకున్న రైతులు మాఫీ సొమ్ము కోసం సహకార సంఘాలకు వెళుతుంటే.. ఆ సొమ్మును వడ్డీ నిమిత్తం జమ చేసుకున్నట్టు అక్కడి ఉద్యోగులు తాపీగా సమాధానమిస్తున్నారు. దీంతో ఏంచేయూలో తెలియక రైతులు లబోదిబోమంటున్నారు.
పూర్తిస్థారుులో రుణమాఫీ కాకపోవడం వల్ల రైతుల బకారుులు రద్దు కాలేదు. దీంతో అన్నదాతలు పంట రుణాలు తీసుకునే అవకాశం కోల్పోయూరు. ఈ పరిస్థితుల్లో కొద్దిపాటిగా ఇచ్చే మాఫీ సొమ్ము అరుునా పంట ఖర్చులకు ఉపయోగపడుతుందని కర్షకులు ఆశించారు. ఆ అశ కూడా అడియూసగా మారడంతో రైతులు ఘెుల్లుమంటున్నారు. అప్పులు చేసి సార్వా పండించామని, దిగుబడి రాకపోవడం, గిట్టుబాటు ధర లభించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయూమని వాపోతున్నారు.
వడ్డీ మొత్తం రైతులే చెల్లించాలట
రుణమాఫీ హామీ ఇచ్చిన సర్కారు కుంటిసాకులు చెబుతూ కాలం వెళ్లబుచ్చుతుండటంతో గతంలో తీసుకున్న పంట రుణాలపై 2014 జన వరి నుంచి 2015 జనవరి వరకు వడ్డీని రైతులే చెల్లించాలని సొసైటీలు, బ్యాంకులు చెబుతున్నారుు. పాలకొల్లు నియోజకవర్గంలోని పాలకొల్లు, యలమంచిలి, పోడూరు మండలాల్లో రైతులకు సుమారు రూ.19 కోట్ల రుణమాఫీ అరుు్యంది. ఇందులో డీసీసీబీ పాలకొల్లు శాఖ పరిధిలోని సహకార సంఘాల్లో సుమారు 7వేల మంది రైతులు దాదాపు రూ.7.23 కోట్లు రుణాలు తీసుకున్నారు. వీరిలో రూ.50 వేల లోపు రుణమాఫీ వర్తించే రైతులు 5,704 మంది ఉన్నారు. వీరికి రుణమాఫీ పేరిట మంజూరైన సొమ్ము మొత్తాన్ని వారు బకారుుపడిన రుణాల ఖాతాలకు మళ్లించి వడ్డీ చెల్లించినట్టుగా జమ వేశారు. ఇలా చేయడం దారుణమని ప్రస్తుత దాళ్వా అవసరాల దృష్ట్యా రుణమాఫీ మొత్తాలను తమ చేతికి ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.