కొండ భక్తుల కష్టాలపై టీటీడీ కసరత్తు | Striving for the mistake that the exercise | Sakshi
Sakshi News home page

కొండ భక్తుల కష్టాలపై టీటీడీ కసరత్తు

Published Sun, Jun 1 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM

కొండ భక్తుల కష్టాలపై  టీటీడీ కసరత్తు

కొండ భక్తుల కష్టాలపై టీటీడీ కసరత్తు

  •      ఉచిత దర్శనం భక్తులు త్వరగా శ్రీవారిని చేరుకునేందుకు ప్రత్యేక వ్యవస్థ
  •      క్యూలు, కంపార్ట్‌మెంట్లలో భక్తుల సౌకర్యాలపై నిఘా
  •      జవాబుదారీతనం కొరవడితే సిబ్బందిపై వేటు
  •  సాక్షి, తిరుపతి: శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల కష్టాలపై టీటీడీ దృష్టి సారిం చింది. ఈ క్రమంలో సాధారణ భక్తుల ఇబ్బం దులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నా రు. ఇప్పటికే ఆలయంలోని జయవిజయుల మండపం నుంచి మూడు వరుసలు ఏర్పాటు చేసి భక్తులు స్వామివారిని దర్శించుకునే పద్ధతికి శ్రీకారం చుట్టారు. దీనికి భక్తుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

    ఈ పద్ధతితో లఘుదర్శనంలోనూ స్వామివారిని తనివితీరా చూసుకునే భాగ్యం భక్తులకు కలిగింది. భక్తుల తోపులాటలకు, ఆలయ సిబ్బంది తోసివేతలకు అవకాశం లేదు. ఇదే సమయంలో శ్రీవారి దర్శనానికి వచ్చే వీఐపీ, వీవీ ఐపీల సేవలో తరిస్తూనే సాధారణ భక్తులు క్యూలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎస్వీ, జేఎన్‌టీ (అనంతపురం) యూనివర్సిటీల నుంచి ఇంజినీరింగ్ నిపుణులను రప్పిస్తున్నారు.

    ఉచిత దర్శనం క్యూలు, కంపార్ట్‌మెంట్లలోని భక్తులకు వీలైనంత త్వరగా స్వామివారి దర్శనం కల్పించే మార్గాలను అన్వేషించే బాధ్యతను ఈ నిపుణుల కమిటీకి అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం పదేళ్లుగా స్వామి దర్శనానికి వస్తున్న భక్తులకు సంబంధించిన వివరాలను టీటీటీ ఉన్నతాధికారులు సేకరిస్తున్నారు. అందుకు కొండ భక్తుల కష్టాలపై టీటీడీ కసరత్తు సంబంధించిన కసరత్తును ఈవో గిరిధర్‌గోపాల్ పర్యవేక్షిస్తున్నారు.
     
    గంటగంటకూ భక్తుల వివరాల సేకరణ


    స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తుల వివరాలను ప్రతి గంటకు నమోదు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుం డా క్యూలైన్ భక్తులు వేచి ఉండేందుకు ఏర్పాటు చే సిన కంపార్ట్‌మెంట్లలోని వారిని ఎంత సమయంలో అక్కడి నుంచి విడిచి పెడుతున్నారనే అంశాల ను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. కంపార్ట్‌మెంట్‌లోని భక్తులకు టీటీడీ కల్పించిన సౌకర్యాలు అందుతున్నాయా లేదా అనే విషయమై కూడా నిపుణుల కమిటీ పరిశీలించనుంది. అలాగే అలిపిరి నుంచి కాలిబాటన వచ్చే భక్తులు, వారు కొండపైకి ఎంత సమయంలో చేరుకోవచ్చనే వివరాలను కూడా ప్రతి గంటకు సేకరించాలని నిర్ణయించారు. దీంతో కొండపై ఏ రోజుకారోజు భక్తుల రద్దీని శాస్త్రీయంగా లెక్కించడానికి వీల వుతుందని భావిస్తున్నారు.
     
    భక్తులసౌకర్యాలపై పర్యవేక్షణ
     
    కంపార్ట్‌మెంట్లలో వేచిఉండే భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు ఏ మేరకు చేరుతున్నాయనే అంశంపై అధికారులు నిఘా పెట్టనున్నారు. ఈ విషయంలో ప్రస్తుతం పూర్తిగా పర్యవేక్షణ లేదని అధికారులు అంగీకరిస్తున్నారు. ఇందుకోసం నియమించిన సిబ్బంది, అధికారుల్లో జవాబుదారీ తనం కొరవడటంతో ఈ దుస్థితి నెలకొన్నట్టు చెబుతున్నారు.

    ఇకపై ఇటువంటి సిబ్బందిపై నిఘా ఏర్పాటు చేసి అవసరమైతే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రతి కంపార్ట్‌మెంట్‌లోనూ, క్యూలోనూ నిఘా కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు యంత్రాం గా న్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిద్వారా యాత్రికులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు అందడంతో పాటు వారిలో అసంతృప్తి రాకుండా చూడవచ్చని అంటున్నారు.  

    ఈ అంశాలపై టీటీడీ ఈవో గిరిధర్‌గోపాల్ ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడతూ భక్తులకు అసౌకర్యం లేకుండా చూసేందు కు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. సిబ్బందిలో జవాబుదారీతనం పెంచడంతో పాటు భక్తుల్లో టీటీడీ పట్ల గౌరవభావం పెరిగేం దుకు అవసరమైన ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు.
     
    సీప్‌లో విశ్వం విద్యార్థులకు ర్యాంకులు
     
    తిరుపతి, న్యూస్‌లైన్: పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష(సీప్)లో ఎప్పటిలాగే విశ్వం విద్యాసంస్థల విద్యార్థులు విజయభేరి మోగించారు. తిరుపతి వరదరాజనగర్‌లోని విశ్వం విద్యాసంస్థలో శిక్షణ తీసుకున్న విద్యార్థుల్లో ఆరుగురు జిల్లా స్థాయి ర్యాంకులు కైవశం చేసుకున్నారు. ఐ.ఆనంద్‌కుమార్ 111 మార్కులతో రెండో ర్యాంకు, జె.ఈశ్వర్‌అవినాష్ మూడో ర్యాంక్, ఇంద్రస్వరూప్‌నాయక్ 4వ ర్యాంక్, సి.చరిత 6వ ర్యాంక్, టి.తులసీరాం 7వ ర్యాంక్, ఎన్.రెడ్డిరాణి 9వ ర్యాంక్, బి.హరిత 11వ రాం్యక్ సాధిం చినట్టు విద్యాసంస్థల డెరైక్టర్ విశ్వనాథరెడ్డి తెలిపారు. తిరుపతి, మదన ప ల్లెలోని తమ విద్యాసంస్థల విద్యార్థులు 682 మంది సీప్‌లో జిల్లా స్థాయి టాపర్లుగా నిలిచినట్లు శనివారం ఆయన విలేకరుల సమావేశంలో తెలి పారు. ఈ సమావేశంలో కరస్పాండెంట్ తులసీ విశ్వనాథరెడ్డి, పీఆర్ వో శివప్రసాద్, అధ్యాపకులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement