
మంజు (ఫైల్)
కృష్ణాజిల్లా, చాట్రాయి : ప్రతిభకు తగిన గుర్తింపు పొందనందుకు మనస్థాపం చెంది విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చాట్రాయిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పుచ్చకాయల మంజు (17) చాట్రాయి జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదివి పరీక్షా ఫలితాల్లో 10కి 10 పాయింట్లు సాధించింది. ప్రస్తుతం చాట్రాయి వికాస్ కాలేజీలో ఇంటర్మీడియెట్ చదువుతోంది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభా అవార్డుల్లో తన పేరు లేకపోవడం, ట్రిపుల్ ఐటీలో సీటు రాకపోవడంతో తీవ్ర మనస్థాపం చెంది గురువారం రాత్రి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి పుచ్చకాయల రఘుపతిరెడ్డి సేద్యం పనులు చేస్తుంటారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు స్థానికంగా 9వ తరగతి చదువుతున్నాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె విగతజీవురాలై కనిపించడంతో తల్లిదండ్రులు తీరనిదుఃఖంలో మునిగిపోయారు. పోలీసులకు సమాచారాన్ని అందించారు.
Comments
Please login to add a commentAdd a comment