స్నేహితుడ్ని కాపాడబోయి అనంతలోకాలకు.. | student died while trying to save his friend | Sakshi
Sakshi News home page

స్నేహితుడ్ని కాపాడబోయి అనంతలోకాలకు..

Published Tue, Aug 11 2015 9:46 PM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM

student died while trying to save his friend

పశ్చిమగోదావరి(తాడేపల్లిగూడెం): కాలువలో కొట్టుకు పోతున్న స్నేహితుడ్ని కాపాడబోయి ముగిపోయాడో బాలుడు. వివరాలు.. తాడేపల్లిగూడెంలోని శివాలయం వద్ద గోదావరి ఏలూరు కాలువలో ఈతకు దిగిన పి.ధనుంజయశర్మ(15) అనే బాలుడు ఈ సంఘటనలో గల్లంతయ్యాడు. ప్రత్యేక హోదా కోసం వామపక్షాలు ఇచ్చిన బంద్‌తో స్కూల్ తెరుచుకోపోవటంతో ముగ్గురు స్నేహితులతో కలిసి ధనుంజయ్ సరదాగా ఈతకెళ్లాడు.

ఈ క్రమంలోనే కాలువలోకి దిగిన మరో బాలుడు కొట్టుకుపోతుండగా రక్షించబోయి తాను మునిగిపోయాడు. మంగళవారం రాత్రి బాలుడి మృతదేహం మునిగిపోయిన చోటే తేలింది. ధనంజయ్ శర్మ స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement