కడప సెవన్‌రోడ్స్ : పాలిటెక్నిక్ పూర్తిచేసి ఈ-సెట్‌లో ఉత్తీర్ణులై ఇంజనీరింగ్‌లో ప్రవేశించిన విద్యార్థులకు పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు సోమవారం కలెక్టరేట్ ఎదుట బైఠాయింపు నిర్వహించారు. అంతకమునుపు నగరంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు రమణ, జి.సిద్దరాజు, బాబులు మాట్లాడుతూ జీఓ నెం. 86ను తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ భిక్ష కాద ని, అది విద్యార్థుల హక్కన్నారు.
తాము ప్రతిభతోనే ఇంజనీరింగ్‌లో సీట్లు పొం దుతున్నామన్నారు. కాగా, పూర్తి స్థాయి లో పాలిటెక్నిక్ నుంచి వచ్చిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. పలుమార్లు ఈ అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. టెక్నికల్ విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
విద్యార్థుల సమస్యలను పరి ష్కరించడంలో ఏమాత్రం చొరవ చూప ని విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీ నామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఏబీవీపీ నాయకులు గుణవర్మ, ఎన్.రాజా, రాయుడు తదితరులను బలవంతంగా అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అయినా, విద్యార్థులు పట్టువిడవకుండా నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. పోలీసుల వైఖరిని వారు తీవ్రంగా దుయ్యబట్టారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు కమ్మయ్య, సుభాన్‌బాష, రసూల్, రాజేష్, సాయి, ఆనంద్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలి
Published Tue, Aug 5 2014 3:19 AM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM
Advertisement