ఎస్వీయూ హాస్టళ్లలో జామర్లు! | su University jammer in hostels | Sakshi
Sakshi News home page

ఎస్వీయూ హాస్టళ్లలో జామర్లు!

Published Tue, Aug 4 2015 2:43 AM | Last Updated on Sun, Sep 3 2017 6:43 AM

ఎస్వీయూ హాస్టళ్లలో జామర్లు!

ఎస్వీయూ హాస్టళ్లలో జామర్లు!

రాత్రి వేళల్లో సెల్‌వాడకుండా ఉండేందుకు నిర్ణయం
త్వరలో అమలులోకి

 
యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీయూలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు, పరిణామాల నేపథ్యంలో వర్సిటీ మహిళా హాస్టళ్లలో జామర్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. మహిళా హస్టళ్లలో విద్యార్థినులు అర్ధరాత్రి దాటినా ఫోన్లు వదలడం లేదు. రాత్రివేళల్లో సెల్‌ఫోన్ నిషేధాన్ని అమలులోకి తెచ్చినా ఫలితం లేదు. దీంతో రాత్రి 9 తర్వాత ఫోన్‌వాడితే జరిమానా విధించాలని అధికారులు నిబంధనలు పెట్టారు. అయినప్పటికీ ఫలితం దక్కడంలేదు. రాత్రివేళల్లో వార్డెన్లు, స్టీవార్డెన్ల కళ్లు కప్పి గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడుతూ కాలం గడుపుతున్నారు. కొంతమంది రాత్రి రెండు మూడుగంటల వరకు ఫోన్లు వదలడం లేదని వార్డెన్ దృష్టికి వచ్చింది. క్యాంపస్‌లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రధాన కారణం అతిగా సెల్‌ఫోన్ల వినియోగమేనని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఎక్కువ సేపు  మాట్లాడ డం వల్ల  చదువు నిర్లక్ష్యం చేయడం, చె డు స్నేహం చేయడం, ఇతర వ్యాపకాల్లో ఉండడం, కొన్ని సందర్భాల్లో భావోద్వేగాలను అణచుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు అధికారుల దృష్టికి వచ్చాయి. గత ఏడాది కొంతమంది విద్యార్థినులు హాస్టల్ గదుల్లో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. న వంబర్ ఒకటిన బీటెక్ విద్యార్థిని సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూనే భావోద్వేగాలను అణుచుకోలేక ఆత్మహత్య చేసుకుంది.

ఈ సంఘటన నేపథ్యంలో సెల్‌ఫోన్ వాడకాన్ని నియంత్రిస్తే ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడవచ్చని అధికారులు నిర్ధారణకు వచ్చారు. శ్రీపద్మావతి డిగ్రీ కళాశాల, ఇంటర్  కళాశాల, విద్యానికేతన్ తదితర విద్యాసంస్థల్లో సెల్‌ఫోన్లు మాట్లాడడంపై నియంత్రణ ఉం ది. ఇలాంటి విధానాన్ని ఎస్వీయూలో అమలులోకి తేవాలని సూచనలు చేస్తున్నారు. దీనికి జామర్లు ఏర్పాటే సరైన చర్య అని వారు భావిస్తున్నారు. రాత్రి 9 గంటల తర్వాత జామర్లు ఆన్‌చేసి సెల్‌ఫోన్లు పనిచేయకుండా పనిచేయాలని ప్రయత్నిస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఇతరులతో రాత్రి 9 గంటల వరకు మాట్లాడుకునే అవకాశం కల్పించి 9 తర్వాత ఫోన్లు పనిచేయకుండా చేస్తే ఫలితం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అత్యవసరమైతే కామన్ ల్యాండ్ ఫోన్ల సౌకర్యం కల్పించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఈ అంశంపై వార్డెన్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని వార్డెన్లకు సూచించారు. అన్ని అనుకూలిస్తే సెప్టెంబర్ నుంచి జామర్ల వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement