రెంటచింతలలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత
విశాఖపట్నం: గత వారం రోజులుగా అల్పపీడన ప్రభావంతో తగ్గుముఖం పట్టిన ఎండలు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా 40 డిగ్రీలు దాటని ఉష్ణోగ్రతలు సోమవారం ఏకంగా 44 డిగ్రీలు దాటి నమోదయ్యూరుు. సోమవారం గుంటూరు జిల్లా రెంటచింతలలో గరిష్టంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే తిరుపతిలో 43, ఒంగోలు 42.8, నెల్లూరు 42.7, హైదరాబాద్ 38.2, విశాఖపట్నంలో 37.6. డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది.
వాతావరణంలోని తేమ ఉక్కబోతకు కారణమవుతున్నట్టు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని తెలిపారు. అయితే అదే సమయంలో ఏర్పడే క్యూములోనింబస్ మేఘాల కారణంగా మధ్యాహ్నం, సాయంత్రం పూట అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నట్టు చెప్పారు.
భానుడి భగ భగ
Published Tue, May 13 2014 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 7:16 AM
Advertisement
Advertisement