శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే.పట్నాయక్ శ నివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాత్రి 8 గంటలకు ఆయన కుటుంబ సమేతంగా ఆలయూనికి విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి ప్రసాదాలు అందజేశారు. ఆదివారం ఉదయం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరి అప్పారావుతో కలిసి మరోసారి పట్నాయక్ శ్రీవారిని దర్శించుకోనున్నారు.
శ్రీలంక అధ్యక్షుడు
రాజపక్సే సతీమణి రాక
శ్రీవారిని దర్శించుకునేందుకు శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సే సతీమణి షిరంతి రాజపక్సే శనివారం తిరుమలకు విచ్చేశారు. ఆదివారం వేకువజామున ఆమె శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. - సాక్షి, తిరుమల