అవినీతి టీచరుపై చర్య తీసుకోండి
- ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు
- చంద్రగిరి ప్రజలు,
- నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు
చిత్తూరు (అగ్రికల్చర్): పూతలపట్టు మండలానికి చెందిన బాలక్రిష్ణారెడ్డి అనే టీచరుపై చర్యలు తీసుకోవాలని చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు, వైఎస్సార్‌సీపీ నాయకుల కలసి ప్రజలు సోమవారం జిల్లా కలెక్టర్ సిద్దార్థ్‌జైన్‌కు ఫిర్యాదుచేశారు. మాజీమంత్రి గల్లా అరుణకుమారికి అనధికారిక పీఏ గా వ్యవహరిస్తున్న బాలక్రిష్ణారెడ్డి విధులకు డుమ్మాకొడుతూ అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఆయన నియోజకవర్గం పరి ధిలో జరిగే ప్రతి అభివృద్ధి పనిలోను కాంట్రాక్టర్లు, అధికారుల నుంచి పర్సంటేజీల కింద పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.
పలువురికి ఉద్యోగాలు, అధికారులకు ప్రమోషన్లు, ప్రజలకు రేషన్‌కార్డులు, రేషన్ షాపులు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని, విక్రయించి కోట్లాది రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. ప్రతినెలా పోలీ సులు, మండలస్థాయి అధికారులు, రేషన్‌డీలర్ల నుంచి మామూళ్లు వసూ లు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన తిరుపతి రూరల్ మండల పరిధిలో పలుచోట్ల విలువైన ప్లాట్లు కొనుగోలు చేశారని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో డబ్బులు వసూలు చేయడానికి ఒక్కో విభాగంలో ప్రభు త్వ ఉద్యోగిని ఒక్కొక్కరిని ఏజెంటుగా నియమించుకున్నారని వారి పేర్లుతో సహా కలెక్టర్‌కు తెలి యజేశారు.
కోరుకున్న మైనర్ పంచాయతీలో వీఆర్వో పోస్టు కావాలంటే లక్ష రూపాయలు, మేజర్ పంచాయతీలో కార్యదర్శి పోస్టు కు రూ. 5 లక్ష లు, ఎమ్మార్వో, ఎంపీడీవో పోస్టులు 10 లక్షలు, ఏపీఎం, ఏపీవో పోస్టుల అయితే లక్ష నుంచి 2 లక్షల వరకు, టీచర్లు, గుమస్తా ఉద్యోగులయితే 25 నుంచి 50 వేలు, ఇంజినీరింగ్ విభాగంలో ఏఈలకు లక్ష రూపాయలు, డీఈలకు 5 లక్షలు రేటు నిర్ణయించారన్నారు. ఈ సందర్భంగా వారు కలెక్టర్‌తోపాటు జేసీ, డీపీవో, సీఈవో, డీఆర్‌డీఏ, డ్వామా, హౌసింగ్ పీడీలు, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఇరిగేషన్ ఎస్‌ఈలు, కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో, అడిషనల్ జాయింట్ కలెక్టర్లను కలిసి ఫిర్యాదుచేశారు. ఈ బదిలీలు పూర్తయిన వెంటనే ఆయన రాజీనామాచేసే యోచనలో ఉన్నారని పేర్కొన్నారు. ఒక విచారణ అధికారిని నియమిస్తే ఆయన అక్రమాలను ఆధారాలతో నిరూపిస్తామని కలెక్టర్‌కు తెలియజేశారు. దీనిపై స్పందిం చిన కలెక్టర్ పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు.