Balakrishnareddy
-
AP HC: ఈ కేసు మాకో గుణపాఠం
సాక్షి, అమరావతి : నెల్లూరులో వైఎస్సార్సీపీ నేత కె.బాలకృష్ణారెడ్డి భవనం కూల్చివేత విషయంలో ఆ నగర మునిసిపల్ కమిషనర్ సూర్యతేజ తీరుపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. భవనం విషయంలో కఠిన చర్యలేవీ తీసుకోవద్దంటూ ఇచ్చినవి మౌఖిక ఆదేశాలే తప్ప, రాతపూర్వక ఆదేశాలు కాదని, అందువల్లే భవనం కూల్చివేశామన్న కమిషనర్ వాదన హైకోర్టును ఒకింత షాక్‌కి గురి చేసింది. ఈ కేసు తమకో గుణపాఠమని హైకోర్టు తెలిపింది. ఇకపై ఇలాంటి పొరపాటు చేయబోమని, మౌఖిక ఆదేశాలు ఇవ్వబోమని, ఏ ఆదేశాలైనా రాతపూర్వకంగానే ఇస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే భవనం కూల్చివేసినందున రిట్ పిటిషన్లో తేల్చడానికి ఏమీ లేదని ఆ మేరకు పిటిషన్‌ను పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వడ్డిబోయన సుజాత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 24 గంటల్లో భవనాలను తొలగించకపోతే తామే కూల్చివేస్తామంటూ నెల్లూరు మునిసిపల్ అధికారులు ఇచి్చన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ బాలకృష్ణారెడ్డి సంబం«దీకులు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ సుజాత విచారణ జరిపారు. గత నెల 22న ఈ వ్యాజ్యం విచారణకు రాగా, తదుపరి విచారణ వరకు భవనం కూల్చివేత విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మునిసిపల్ కార్పొరేషన్‌ను న్యాయమూర్తి ఆదేశించారు.విచారణను గత నెల 24కి వాయిదా వేశారు. అయితే, 24న వ్యాజ్యం విచారణకు రాలేదు. దీంతో హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, మునిసిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు గత నెల 27న ఆ భవనాన్ని కూల్చేశారు. 29న ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, భవనం కూల్చివేత ఫొటోలను పిటిషనర్ల తరపు న్యాయవాది సురేందర్‌రెడ్డి కోర్టుకు సమర్పించారు. అధికారులు చట్ట విరుద్ధంగా వ్యవహరించారని తెలిపారు. దీంతో మునిసిపల్ కమిషనర్ సూర్యతేజ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు వచ్చిoది. సూర్యతేజ కోర్టు ముందు హాజరయ్యారు. ఆయన తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. తదుపరి విచారణ వరకు చర్యలు తీసుకోవద్దంటూ 22న కోర్టు మౌఖికంగానే ఆదేశించి, విచారణను 24కి వాయిదా వేసిందన్నారు. 23, 24 తేదీల్లో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని, 27న కూల్చివేశామని చెప్పారు. పిటిషనర్ల తరపున సురేందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. 24న పిటిషన్ విచారణకు రానందున నిర్మాణాలను తొలగించేందుకు 3నెలల సమయం కోరామని, ఆ మేర అఫిడవిట్ వేస్తామని కూడా చెప్పామని వివరించారు. దీనికి ఏజీ స్పందిస్తూ.. 24 వరకే కఠిన చర్యలు తీసుకోవద్దని మౌఖికంగా చెప్పారే తప్ప, రాతపూర్వక ఆదేశాలివ్వలేదని తెలిపారు. ఈ వాదనపై న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు. -
త్వరలో సెట్ల తేదీలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు చేసేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు మొదలుపెట్టింది. డిసెంబర్ మొదటి వారంలో తేదీలను ప్రకటించే వీలుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీఈఏపీసెట్)పై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈసారి ఈ పరీక్షను ముందుకు జరపాలని, తద్వారా విద్యా సంవత్సరాన్ని ముందే ప్రారంభించేందుకు ప్రయతి్నస్తున్నామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఇటీవల మండలి ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు. ప్రవేశ పరీక్ష, ఫలితాల వెల్లడి, కౌన్సెలింగ్ తేదీలను ఒకేసారి ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నారు. యాజమాన్య కోటా సీట్లను కూడా ఈసారి ఆన్లైన్ విధానంలో భర్తీ చేస్తామని మండలి చైర్మన్ తెలిపారు. దీనిపైనా త్వరలో నిర్ణయం తీసుకునే వీలుంది. త్వరగా తేదీలివ్వండి.. ఈఏపీసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పాలిసెట్, ఐసెట్, ఈసెట్‌లను ఎప్పుడు నిర్వహించాలో సూచించాల్సిందిగా టీసీఎస్ సంస్థను మండలి కోరింది. ప్రతి సంవత్సరం పరీక్షల నిర్వహణకు తేదీలను ఎంపిక చేసే బాధ్యత ఈ సంస్థకు అప్పగిస్తారు. జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల తేదీలను, ముఖ్యంగా జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్‌లో ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. దీని తర్వాత ఈఏపీ సెట్‌కు సన్నద్ధమయ్యేందుకు వీలుగా టీసీఎస్ తేదీలను ఖరారు చేస్తుంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా తేదీలను వెల్లడించాలని టీసీఎస్‌ను అధికారులు కోరారు. ఏ సెట్ బాధ్యత ఎవరికి? ఏ ఉమ్మడి పరీక్షను ఏ యూనివర్సిటీకి అప్పగించాలి? ఎవరిని కన్వీనర్‌గా తీసుకోవాలి? ఏవిధంగా నిర్వహించాలి? అనే అంశాలపై సమగ్ర వివరాలు ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి అన్ని యూనివర్సిటీల వీసీలకు వచ్చే వారం లేఖ రాయబోతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. సాధారణంగా ప్రతి ఏటా ఈఏపీ సెట్‌ను జేఎన్టీయూహెచ్కు అప్పగిస్తున్నారు. సాంకేతిక అంశాలతో ముడిపడిన పరీక్ష కావడంతో సాంకేతిక విశ్వవిద్యాలయానికి అప్పగిస్తున్నారు. ఈసారి కూడా ఈ వర్సిటీకే ఈ సెట్ అప్పగించే వీలుంది. లాసెట్, ఎడ్‌సెట్‌ను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించాలని భావిస్తున్నారు. ఐసెట్‌ను కాకతీయ వర్సిటీకి అప్పగించే వీలుందని తెలుస్తోంది. పాలిసెట్, ఈసెట్‌పై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. -
అంతరిక్ష చట్టం అత్యవసరం
మూడు దశాబ్దాలుగా ప్రభుత్వాలు నిధులు తగ్గించడంతో ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిశోధనలు సాగిస్తున్న అనేక దేశాలు ఇతర అంతరిక్ష కార్యకలాపాలపై దృష్టిసారించాయి. దీంతో ప్రభుత్వాలు, ప్రైవేట్ పరిశ్రమలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ కారణంగా ఉపగ్రహ సమాచారం, చోదన, భౌగోళిక పరిస్థితి, సుదూర గ్రాహకత, సమాచార విశ్లేషణ, మౌలికవసతులు, సంబంధిత సేవలు సుగమం అయ్యాయి. ఇటువంటి కార్యకలాపాలకు నిధుల సమకూర్చడం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు తలకుమించిన భారం. దాంతో అంతరిక్ష కార్యకలాపాలను ప్రైవేటీకరించడంపై దృష్టి సారించారు. దేశాభివృద్ధిలో అంతరిక్ష పరిశోధనలు కీలకపాత్ర పోషిస్తున్నందున రెండు దశాబ్దాలుగా పరస్పరం ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో భారత అంతరిక్ష కార్యక్రమం, పరిశ్రమ నిర్మాణం సాగింది. దీనికి ప్రైవేట్ సెక్టార్ నుంచి తగిన మద్దతు కూడా లభించింది. ప్రైవేట్ భాగస్వామ్యంతో అంతరిక్ష ప్రయోగ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కేబుల్, శాటిలైట్ టెలివిజన్ రంగాల్లో భారత్‌లో విస్తృతమైన మార్కెట్ ఉంది. దూరదర్శన్ తన డీటీహెచ్ ప్రసారాలను ప్రారంభించింది. డీటీహెచ్, డీటీటీ, బ్రాడ్‌బాండ్ వంటి సాంకేతికతలు దేశాన్ని ముంచెత్తాయి. అంతరిక్ష కార్యకలాపాలు ప్రైవేటీకరణ, వ్యాపారీకరణ పొందిన నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ జాతీయ అంతరిక్ష చట్టాలను రూపొందించాయి. ప్రైవేట్ అంతరిక్ష కార్యకలాపాలకు లైసెన్స్ లు ఇవ్వడం, క్లిష్టమైన అంతరిక్ష కార్యకలాపాలపై ఈ చట్టాలు రూపొందాయి. అయితే, సరైన చట్టాలు లేని కారణంగా అంతరిక్ష సాంకేతికతకు పెట్టుబడులను రాబట్టే అనేక అవకాశాలను భారత్ కోల్పోవడం విచారకరం. చంద్రయాన్–2తోపాటు గతంలో విజయవంతమైన అనేక అంతరిక్ష కార్యకలాపాలతో భారత సాంకేతిక సామర్థ్యం ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చింది. ఉపగ్రహాలను ప్రయోగించడం, వాటిని స్వతంత్రంగా నిర్వహించగల దేశాల బృందంలో భారత్‌కు చోటు దక్కింది. ప్రస్తుతం భారత్ అంతరిక్ష సాంకేతికతలో స్వావలంబనను సాధించడమే కాదు, వ్యాపారాత్మకత వినియోగికతను కూడా పెంచుకుంది. సంవత్సరాల తరబడి సాధించిన నైపుణ్యంతో అంతరిక్ష పరిశ్రమలో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదగనుంది. ఒప్పందాలను పూర్తిచేయడం, వివాదాల పరిష్కారం వంటి చట్టపరమైన అంశాలను భారత్ అత్యవసరంగా అధిగమించాల్సి ఉంది. ఒకవైపు అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేట్ సెక్టార్‌కు విస్తృతంగా అవకాశాలు కల్పిస్తున్న దేశాలన్నీ, మరోవైపు అంతర్జాతీయ అంతరిక్ష చట్టం పరిధుల్లో దేశంలోని ప్రైవేట్ సంస్థల అతరిక్ష కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాయి. భారత్ కూడా ప్రైవేట్ సెక్టార్ భాగస్వామ్యంతోనే అంతరిక్ష కార్యకలాపాల్లో దూసుకెళ్తోంది. చంద్రయాన్–1, 2 ప్రయోగాల్లో సుమారు 500మంది పారిశ్రామిక ప్రతినిధులు భాగస్వామ్యం వహించారు. వారి భాగస్వామ్యం లేనట్లయితే మానవ వనరులను సమకూర్చుకోవడం ఇస్రోకు సాధ్యమయ్యేది కాదు. అంతరిక్ష కార్యకలాపాలపై సరైన చట్టం లేనట్లయితే ప్రైవేట్ పెట్టుబడిదారులెవరూ ముందుకు రారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే సాంకేతిక రంగంలో ముందడుగు వేస్తున్నఅనేక దేశాలు ప్రైవేట్ సెక్టార్ చేపట్టే క్లిష్టమైన అంతరిక్ష కార్యకలాపాలపై వివరణాత్మకమైన, ప్రత్యేకమైన జాతీయ అంతరిక్ష చట్టాలను రూపొందించుకున్నాయి. వీటిల్లో అమెరికా, ఇంగ్లండ్, రష్యా, స్వీడన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఉన్నాయి. అన్ని అంతర్జాతీయ అంతరిక్ష ఒప్పందాల్లో భారత్‌కు భాగస్వామ్యం ఉంది. అంతర్జాతీయ అంతరిక్ష చట్టం రూపకల్పనలో భారత్ పాత్ర కీలకమైనది. అయితే, భారత దేశంలో మాత్రం ఎటువంటి స్పష్టమైన, సమగ్రమైన అంతరిక్ష చట్టం లేదు. అంతరిక్ష చట్టం రూపకల్పనలో అంతరిక్ష విభాగపు పాత్రను స్పష్టంగా పేర్కొనాలి. అలాగే, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల పాత్ర, అంతరిక్ష కార్యకలాపాలను చేపట్టడం, అమలు చేసే విధానం, అంతరిక్ష పరిశ్రమలో మానవ వనరుల వినియోగం, వారి ఆర్థిక ప్రయోజనాలు, వేతనాలు, ప్రయోగ దశలో రక్షణ కల్పించడం, అంతరిక్ష వివాదాలు, వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకురావడం, దేశీయ గగనతలంలో విదేశీ అంతరిక్ష వాహకాలు ప్రయాణించడం, జవాబుదారీతనం, బీమా, మేధోపరమైన హక్కుల రక్షణ వీటన్నిటితోపాటు వివిధ ఒప్పందాల కింద అంతర్జాతీయ బాధ్యతలను అమలుచేయడం వంటి అంశాలను చేర్చాల్సి ఉంది. డా. వి. బాలకిష్టారెడ్డి వ్యాసకర్త రిజిస్ట్రార్, నల్సార్ యూనివర్సిటీ ఈ–మెయిల్ : balakista@gmail.com -
‘యువ తెలంగాణ’ ఆవిర్భావం
హైదరాబాద్ : రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులు పోటీలో ఉంటారని యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నారు. సామాజిక స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలనుకున్న వారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. యువతకు, మహిళలకు పెద్దపీట వేస్తామన్నారు. బుధవారం హోటల్ టూరిజం ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో యువ తెలంగాణ పార్టీ జెండాను ఆవిష్కరించిన జిట్టా.. పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను చిన్నచూపు చూస్తోందన్నారు. మంత్రి వర్గంలో వారికి చోటు లేకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. 1999లో యువజన సంఘాల సమితిని ఏర్పాటు చేసి యువజనుల ఉన్నతికి కృషి చేసినట్లు చెప్పారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువ తెలంగాణ పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా ఆవిర్భవించినట్లు ప్రకటించారు. పార్టీ బలోపేతానికి అక్టోబర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు. సీఎం కేసీఆర్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డ జయ శంకర్‌ను విస్మరించి హరికృష్ణకు స్మారక ఘాట్‌ను నిర్మిస్తామని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల్లో ట్యాంక్‌బండ్‌పై జయశంకర్ విగ్రహం పెట్టి స్మారక ఘాట్‌పై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించకపోతే ఇంటికో ఇటుకతో తామే విగ్రహాన్ని నిర్మించుకుంటామన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు.. పార్టీ రాష్ట్ర కమిటీని అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి ప్రకటించారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాణి రుద్రమ, యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రెసిడెంట్‌గా వేణుగోపాల్ కృష్ణ, 12 మంది సభ్యులను ప్రకటించారు. -
అవినీతి టీచరుపై చర్య తీసుకోండి
- ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు - చంద్రగిరి ప్రజలు, - నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చిత్తూరు (అగ్రికల్చర్): పూతలపట్టు మండలానికి చెందిన బాలక్రిష్ణారెడ్డి అనే టీచరుపై చర్యలు తీసుకోవాలని చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకుల కలసి ప్రజలు సోమవారం జిల్లా కలెక్టర్ సిద్దార్థ్జైన్కు ఫిర్యాదుచేశారు. మాజీమంత్రి గల్లా అరుణకుమారికి అనధికారిక పీఏ గా వ్యవహరిస్తున్న బాలక్రిష్ణారెడ్డి విధులకు డుమ్మాకొడుతూ అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఆయన నియోజకవర్గం పరి ధిలో జరిగే ప్రతి అభివృద్ధి పనిలోను కాంట్రాక్టర్లు, అధికారుల నుంచి పర్సంటేజీల కింద పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. పలువురికి ఉద్యోగాలు, అధికారులకు ప్రమోషన్లు, ప్రజలకు రేషన్‌కార్డులు, రేషన్ షాపులు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని, విక్రయించి కోట్లాది రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. ప్రతినెలా పోలీ సులు, మండలస్థాయి అధికారులు, రేషన్‌డీలర్ల నుంచి మామూళ్లు వసూ లు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన తిరుపతి రూరల్ మండల పరిధిలో పలుచోట్ల విలువైన ప్లాట్లు కొనుగోలు చేశారని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో డబ్బులు వసూలు చేయడానికి ఒక్కో విభాగంలో ప్రభు త్వ ఉద్యోగిని ఒక్కొక్కరిని ఏజెంటుగా నియమించుకున్నారని వారి పేర్లుతో సహా కలెక్టర్‌కు తెలి యజేశారు. కోరుకున్న మైనర్ పంచాయతీలో వీఆర్వో పోస్టు కావాలంటే లక్ష రూపాయలు, మేజర్ పంచాయతీలో కార్యదర్శి పోస్టు కు రూ. 5 లక్ష లు, ఎమ్మార్వో, ఎంపీడీవో పోస్టులు 10 లక్షలు, ఏపీఎం, ఏపీవో పోస్టుల అయితే లక్ష నుంచి 2 లక్షల వరకు, టీచర్లు, గుమస్తా ఉద్యోగులయితే 25 నుంచి 50 వేలు, ఇంజినీరింగ్ విభాగంలో ఏఈలకు లక్ష రూపాయలు, డీఈలకు 5 లక్షలు రేటు నిర్ణయించారన్నారు. ఈ సందర్భంగా వారు కలెక్టర్‌తోపాటు జేసీ, డీపీవో, సీఈవో, డీఆర్డీఏ, డ్వామా, హౌసింగ్ పీడీలు, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఇరిగేషన్ ఎస్ఈలు, కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో, అడిషనల్ జాయింట్ కలెక్టర్లను కలిసి ఫిర్యాదుచేశారు. ఈ బదిలీలు పూర్తయిన వెంటనే ఆయన రాజీనామాచేసే యోచనలో ఉన్నారని పేర్కొన్నారు. ఒక విచారణ అధికారిని నియమిస్తే ఆయన అక్రమాలను ఆధారాలతో నిరూపిస్తామని కలెక్టర్‌కు తెలియజేశారు. దీనిపై స్పందిం చిన కలెక్టర్ పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు.