పీపై చర్యలు తీసుకోండి | Take actions arpipai | Sakshi
Sakshi News home page

పీపై చర్యలు తీసుకోండి

Published Tue, Jul 1 2014 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 9:36 AM

Take actions arpipai

  •     కార్పొరేషన్ ఎదుట మెప్మా సంఘాల మహిళల ధర్నా
  •       రిసోర్స్‌పర్సన్‌పై దాడి యత్నం
  •      కార్పొరేషన్ కార్యాలయం ఎదుట రెండు గంటలు ఉద్రిక్తత
  •  
    తిరుపతి కార్పొరేషన్ : సమయం సోమవారం సాయంత్రం 5.30 గంటలు.. రెండు ఆటోల్లో దిగిన మహిళలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోకి వెళ్లారు. అక్కడ ఏమైందో ఏమో ఒక్కసారిగా కార్యాలయం ఎదుట మెరుపు ధర్నాకు దిగారు. పొదుపు సొమ్ము స్వాహా చేసిన రిసోర్స్‌పర్సన్ (ఆర్‌పీ)ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారం టూ మెప్మా అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చి న ఆర్‌పీపై మహిళా సభ్యులు దాడికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధితుల కథనం మేరకు...       
     
    తిరుపతిలోని స్కావెంజర్ కాలనీకి చెందిన 12 సంఘాలకు సంబంధించిన పొదుపు సొమ్మును ఆర్‌పీ రాధ స్వాహా చేసిందని ఆరోపిస్తూ సోమవారం సాయంత్రం కార్పొరేషన్ ఎదుట మహిళలు ధర్నాకు దిగారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన పొదుపు సొమ్మును సభ్యులకు తెలియకుండా ఆర్‌పీ రూ.27.12 లక్షలు స్వాహా చేసిందని ఆరోపించారు.

    కడుపు మాడ్చుకుని కూడబెట్టుకున్న పొదుపు డబ్బును బ్యాంకులో జమ చేస్తానంటూ సొంతానికి వాడుకున్న రాధా విలువైన ఆస్తులను కూడబెట్టుకుందన్నారు. మోసపోయిన తమకు న్యాయం చేయాల్సిన మెప్మా పీవో, సీవో, కార్పొరేషన్ అధికారులు పొదుపు సొమ్ము స్వాహా చేసిన ఆర్‌పీని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ నినాదాలు చేశారు.

    ఆర్‌పీపై మహిళల దాడి యత్నం...
     
    అప్పటికే కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్న ఆర్‌పీ రాధ అక్కడి నుంచి చిన్నగా జారుకునే ప్రయత్నం చేయడంతో మహిళలు అడ్డుకున్నా రు. తమ సొమ్మును దిగమింగింది చాలక త ప్పించుకునే ప్రయత్నం చేస్తావా అంటూ ఆగ్రహంతో ఆర్‌పీపై దాడికి ప్రయత్నించారు. కొం త సేపు అరుపులు కేకలతో ఒకరినొకరు పెనుగులాడుతూ తోసుకున్నారు.

    అక్కడున్న పోలీసు లు, మెప్మా పీవో జయరాం మహిళా సభ్యులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘాల్లో వంద రూపాయాలు బాకీ ఉంటే ముక్కుపిండి వసూలు చేయించే బ్యాంకు, మెప్మా అధికారులు, ఆర్‌పీ రాధా లక్షలు స్వాహా చేసినా ఎందుకు రికవరీ చేయలేదంటూ నిలదీశారు. ఆర్‌పీ స్వాహా చేసి న డబ్బులో మీకు వాటాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. తమ కడుపులు కొట్టాలని చూస్తే మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. దాదాపు రెండుగంటల పాటు కార్యాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొన్నా కార్పొరేషన్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విశేషం.
     
    పొదుపు సొమ్ము స్వాహా చేయలేదు : ఆర్‌పీ
     
    మహిళలకు చెందిన పొదుపు సొమ్మును తాను స్వాహా చేయలేదని ఆర్‌పీ రాధ తెలిపారు. 2009లో కొందరికి రుణాలు తీసిచ్చిన మాట వాస్తవమేనని, అయితే ఆపై ఎలాంటి రుణాలు తీసివ్వలేదని తెలిపారు. సభ్యుల పొదుపు ఒక్క పైసా కూడా స్వాహా చేయలేదని, దీనిపై విచారణ జరుగుతోందన్నారు. తప్పు చేసినట్టు రుజువైతే సొమ్మును చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టు పోలీసుల ఎదుట స్పష్టం చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement