'త్వరలో చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకుంటారు'
ఉచిత హామీలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తగిన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వైఎస్ఆర్ సీపీ నేత తమ్మినేని సీతారాం హెచ్చరించారు.
ఎన్నికల నియమ, నిబంధనల్ని ఉల్లంఘించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే ఆలోచనలో టీడీపీ ఉందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏపార్టీ వ్యవహరించని తీరుగా టీడీపీ వ్యవహరిస్తోందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జారీ చేసే విప్ ధిక్కరిస్తే అనర్హత వేటు తప్పదని సీతారాం అన్నారు. మెజార్టీ ఉన్న ప్రాంతాల్లో గెలిచేందుకు వ్యూహ రచన చేస్తున్నామని సీతారాం తెలిపారు.