తవ్వుకో.. దండుకో! | Tavvuko .. extortion! | Sakshi
Sakshi News home page

తవ్వుకో.. దండుకో!

Published Sat, Jan 3 2015 1:42 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

తవ్వుకో.. దండుకో! - Sakshi

తవ్వుకో.. దండుకో!

తాడిపత్రి: ఇసుక దిన్నె(రీచ్)లను గ్రామైక్య సంఘాలకు అప్పగించి, తద్వారా అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయూలన్న ప్రభుత్వ నిర్ణయం బెడిసి కొట్టింది. ప్రథమికంగా జిల్లాలో మూడు చోట్ల పెన్నా, చిత్రవతి నదుల్లో ఇసుక తవ్వి అమ్ముకోవడానికి ప్రభుత్వం గ్రామైక్య సంఘాలకు అనుమతి ఇచ్చింది. ఇందుకు కొన్ని నియమ నిబంధనలు పాటించాలని చెప్పింది. అయితే ఇసుక తవ్వకాల్లో కనీస ప్రమాణాలు పాటించకుండా నదుల్లో ఇష్టానుసారం ఇసుకను తవ్వేస్తున్నారు.

నిబంధనల ప్రకారం గ్రామాలు, పంట పొలాలు లేని చోట, ఒక మీటర్ లోతు వరకు మాత్రమే అనుమతి ఇచ్చిన చోటే తవ్వకాలు సాగించాల్సి ఉంది. కానీ జిల్లాలోని ఇసుక దిన్నెల వద్ద పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. పొక్‌లైన్‌లతో మూడు నుంచి నాలుగు మీటర్ల లోతున తవ్వేస్తున్నారు. తవ్వకాలను పర్యవేక్షించాల్సిన గ్రౌండ్ వాటర్, గనులు, రెవెన్యూ శాఖల అధికారులు వాటి దరిదాపులకు కూడా వెళ్లడం లేదు. ఇదే అదునుగా పగలు ఇసుక దిన్నెల నిర్వాహకులు, రాత్రిళ్లు ఇసుక అక్రమ రవాణా దారులు తవ్వేస్తున్నారు.

అనుమతులు గోరంత.. తోడేస్తున్నది కొండంత
చిత్రావతి పరివాహక ప్రాంతమైన శింగనమల మండలం ఉల్లికల్లు (సాయిబాబా శాండ్ మైనింగ్ ఎం.ఎ.సి.ఎస్ లిమిటెడ్), పెద్దపప్పూరు మండలం చిన్నయక్కలూరు (గంగమ్మ శాండ్ మైనింగ్ ఎం.ఎ.సి.ఎస్. లిమిటెడ్), చిత్రవతినది పరివాహక ప్రాంతమైన తాడిమర్రి మండలం చిన్నచిగుళ్లరేవు (చిత్రావతి శాండ్ మైనింగ్ ఉమెన్ ఎం.ఎ.సి.సి.ఎస్. లిమిటెడ్)ల్లో ఇసుక తవ్వకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు మూడు రిచ్‌లు 16,552 క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వితీసి అమ్మకాలు సాగించాయి. దీంతో ప్రభుత్వానికి రూ.1.16 కోట్ల ఆదాయం వచ్చింది.  

పర్యవేక్షణ కరువు.. సదుపాయాలు లేవు
ఆదాయమే పరమావధిగా భావించిన ప్రభుత్వం హుటాహుటిన అనుమతులు మంజూరు చేసి చేతులు దులుపుకుంది. ఇసుక తవ్వకాలు సాగుతున్న  ప్రాంతాల్లో, డంపింగ్ వద్ద పర్యవేక్షణ కరువైంది. రాత్రిళ్లు సిబ్బంది సైతం అభద్రతతో ఉండాల్సి వస్తోంది. మరి కొన్ని చోట్ల రాత్రిళ్లు సిబ్బంది ఉండలేకపోతున్నారు. రాజకీయ ఒత్తిడి వల్ల కేటాయించిన పరిమితి కంటే కూడా అధికంగా ఇసుకను నింపాల్సి వస్తోంది.  ఇసుక పరిమాణం, బరువును చూసే యంత్రాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు.

స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత
ఇసుక తవ్వకాలపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. స్థానిక నేతలు ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్విపోసుకుంటున్నారు. నదులు, వంకలు గుంతలమయమైపోయూరుు. భూగర్భ జలాల పరిస్థితి ఆందోళనకర స్థారుుకి పడిపోతోంది. చిన్నపాటి వర్షాలకు నదిలోకి కొద్దిపాటి నీరు వస్తే ముందుకు పారని దుస్థితి నెలకొంది.

ఇసుకాసురులతో పెన్నా నది కొల్లబోతోందని, ప్రభుత్వం ఇంకా చూస్తూ ఉంటే తామే రంగంలోకి దిగి ఇసుక తవ్వకాలను అడ్డుకుంటామని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించడం చర్చనీయూంశమైంది. ఇసుక తవ్వకాలతో ఆదాయం రుచి మరిగిన టీడీపీ నేతలు.. అడ్డు చెబుతున్న స్థానికులను బెదరగొడుతున్నారు. అధికారులను సైతం భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement