ఉప ఎన్నిక జరగనున్న కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ ఆగడాలు మితిమీరుతున్నాయి.
నంద్యాల: ఉప ఎన్నిక జరగనున్న కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ ఆగడాలు మితిమీరుతున్నాయి. తమకు మద్దతు పలకని చిన్నాచితక నాయకులపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగుతున్నారు. సోమవారం పొన్నాపురం గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేశారు.
మతి లేని వారిలా నటించిన ఇద్దరు టీడీపీ కార్యకర్తలు బండరాళ్లతో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. ఈ ఘటనలో నాగ సుబ్బారాయుడనే వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త తలపై బండరాయితో మోదారు. దాంతో ఆయన తీవ్ర గాయాలపాలయ్యారు. స్ధానికులు ఆయన్ను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమపై దాడి జరిగే అవకాశం ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను ముందుగానే కోరిన వారు తమ అభ్యర్థనను పట్టించుకోలేదని వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు చెబుతున్నారు.